Begin typing your search above and press return to search.

తెలంగాణ లోక‌ల్ 'స్టేట‌స్‌' మార‌దు!

తెలంగాణ పౌరులుగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద చిక్కు ప్ర‌శ్న‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏర్ప డిన తెలంగాణ‌లో ఉద్యోగాలు, విద్య వంటి విష‌యాల్లో లోక‌ల్‌ స్టేట‌స్ పెద్ద వివాదంగా మారింది.

By:  Garuda Media   |   28 Sept 2026 4:40 PM IST
తెలంగాణ లోక‌ల్ స్టేట‌స్‌ మార‌దు!
X

తెలంగాణ పౌరులుగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద చిక్కు ప్ర‌శ్న‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏర్ప డిన తెలంగాణ‌లో ఉద్యోగాలు, విద్య వంటి విష‌యాల్లో లోక‌ల్‌ స్టేట‌స్ పెద్ద వివాదంగా మారింది. దీనిపై గ‌తంలోనే ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చినా.. దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. తెలంగాణ‌లో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క‌రికీ లోక‌ల్ స్టేట‌స్ ఉంటుంది. కానీ, ఇత‌ర వ్య‌క్తుల మాటేంటి? అనేది ప్ర‌శ్న‌.

దీనికి తాజాగా సుప్రీంకోర్టు మ‌రోసారి సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎవ‌రైనా స‌రే.. తెలంగాణలో జ‌న్మిస్తే.. వారికి ఆటోమేటిక్‌గానే స్టేట‌స్ వ‌చ్చేస్తుంది. ఇత‌ర వ్య‌క్తుల‌కు అంటే.. విద్యార్థుల‌కు.. మాత్రం నాలుగు సంవ‌త్స రాలు వ‌రుస‌గా తెలంగాణ‌లో చ‌దివితేనే లోక‌ల్ స్టేట‌స్ కింద రిజ‌ర్వేష‌న్ ల‌భిస్తుంద‌న్న‌ది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. వాస్త‌వానికి గ‌తంలోనూ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు ఇచ్చారు. రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత‌.. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం కామ‌న్‌.

దీనిని అనుస‌రించి రిజ‌ర్వేష‌న్‌, ఉద్యోగాలు, విద్య వంటివాటిని ప్ర‌భుత్వాలు నిర్దేశిస్తాయి. దీని ప్ర‌కారం.. రాష్ట్ర‌ప‌తి కూడా.. త‌మ ఉత్త‌ర్వుల్లో నాలుగు సంవ‌త్స‌రాల పాటు తెలంగాణ‌లో వ‌రుసగా చ‌దువుకున్న వారిని లోక‌ల్‌గానే ప‌రిగ‌ణిస్తారు. అయితే.. రెండేళ్లు చ‌దివి విరామం ఇస్తే.. కుద‌ర‌దు. ఇదే విష‌యంపై తాజాగా సుప్రంకోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింది. వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు చ‌దివిన వారికి మాత్ర‌మే లోక‌ల్ స్టేటస్ ద‌క్కుతుంద‌ని.. దీని విష‌యంలో ఎలాంటి మార్పులు లేవ‌ని తేల్చి చెప్పింది.

ఎందుకు?

ఉద్యోగాల భ‌ర్తీ.. విద్యాసంస్థ‌ల్లో సీట్ల విష‌యంలో స్థానిక‌త‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగాల విష‌యానికి వ‌స్తే.. స్థానిక అభ్య‌ర్థుల‌కు 90 శాతం ఉద్యోగాల‌ను రిజ‌ర్వ్ చేస్తే.. ఇత‌రుల‌కు 10 శాత‌మే ఉంటున్నాయి. దీంతో పోటీ ఎక్కువ‌గా ఉంటే.. అభ్య‌ర్థులు అవ‌కాశాలు పోగొట్టుకుంటున్నారు. అలానే.. విద్యాసంస్థ‌ల్లోనూ.. లోక‌ల్ విద్యార్థుల‌కు సీట్లు త్వ‌ర‌గా ల‌భిస్తాయి. నాన్ లోక‌ల్ కేట‌గిరీకి ఖ‌ర్చుతో పాటు సీటు ల‌భ్య‌త కూడా క‌ష్టంగానే ఉంది. దీంతో లోక‌ల్ స్టేట‌స్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది.