Begin typing your search above and press return to search.

ఎస్‌!... కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ల‌కు ఫైర్ టెస్టే!

ఔను.. తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాంబూలాలు ఇచ్చేసింది.

By:  Garuda Media   |   30 Sept 2025 6:00 PM IST
ఎస్‌!... కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ల‌కు ఫైర్ టెస్టే!
X

ఔను.. తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాంబూలాలు ఇచ్చేసింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఈ ఎన్నిక‌లు .. ఐదు ద‌శ‌ల్లో వ‌చ్చే న‌వంబ‌రు వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలావుంటే.. ఈ ఎన్నిక‌లు అటు అధికార‌, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షా ల‌కు కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామ‌ని చెబుతోంది. ఇక‌, బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్ర‌జ‌లు త‌హ‌త‌హ లాడుతున్నార‌ని అంటోంది.

ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల‌కు ఈ ఎన్నిక‌లు ప్రాణ ప్ర‌దంగా మారాయి. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఎలా ఉన్నా యి? ఏ ప‌క్షానికి అనుకూలంగా ఉన్నాయి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. గెలుపు గుర్రం ఎక్కేందుకు.. ఎవ‌రికి అవ‌కాశం ఉంది? మెజారిటీ పంచాయ‌తీలు.. మెజారిటీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌ను కైవసం చేసుకునేందుకు ఏ పార్టీకి సానుకూల ప‌రిణామాలు ఉన్నాయ‌న్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతోంది. దీంతో ప్ర‌స్తుతం కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ ఎస్ అన్న‌ట్టుగా ఉన్న ప‌రిణామాల‌ను చూద్దాం..

కాంగ్రెస్ అనుకూలం ఇవీ..

1) గ‌తంతో పోల్చుకుంటే.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న మంత్రులు.. ఎమ్మెల్యేలు.

2) రాజ‌సం వ‌దిలి.. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.

3) 60 వేల పైచిలుకు ఉద్యోగాల క‌ల్పన‌.

4) పెట్టుబ‌డుల సాధ‌న కోసం ప్ర‌య‌త్నాలు.

6) ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం.

7) ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.

8) మూసీ న‌ది సుందరీక‌ర‌ణ‌.

కాంగ్రెస్ ప్ర‌తికూలం..

1) రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆశించిన విధంగా స్పంద‌న లేక‌పోవ‌డం.

2) ఇందిర‌మ్మ ఇళ్లవిష‌యంలో సామాన్యుల‌కు ఒన‌గూర‌ని ల‌బ్ధి.

3) ప్ర‌తి విష‌యానికీ ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లుసుని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.

4) హైడ్రా ద్వారా సామాన్యుల‌ను కూడా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం.

5) స‌ఖ్య‌త క‌రువైన పార్టీ నాయ‌కుల వివాదాలు.

6) ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నా.. ప్ర‌గ‌తి విష‌యంలో క‌నిపించ‌ని అభివృద్ధి

7) హైద‌రాబాద్ మున‌క‌.

బీఆర్ ఎస్ అనుకూలం ..

1) ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ పార్టీగా త‌న ప‌ట్టునిలుపుకొనే ప్ర‌య‌త్నం.

2) స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో వినిపించే యంత్రాంగం.

3) బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా వాయిస్ వినిపించ‌డం.

4) సీఎం రేవంత్ రెడ్డిని ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీయడం.

బీఆర్ ఎస్ ప్ర‌తికూల‌త‌లు..

1) సొంత పార్టీలో క‌విత కుంప‌టి.

2) కాళేశ్వ‌రం అవినీతిపై ప్ర‌జ‌ల్లో ఉన్న చ‌ర్చ‌.

3) ప్ర‌జ‌ల‌కు చేరువ కాని కేసీఆర్ రాజ‌కీయం.

4) ప‌దేళ్లు అవినీతిపై తొలిగిపోని చ‌ర్చ‌.

5) ప్ర‌జా ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌కు పేరు లేక‌పోవ‌డం.

6) ప్ర‌జా ఉద్య‌మాల నిర్మాణంలో వెనుకంజ‌.

7) ఇప్ప‌టికీ పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా వేస్తున్న అడుగులు.