తెలంగాణలో ఘోరం.. కోడలితో' కనెక్షన్' పెట్టుకుని కొడుకుని చంపించేశాడు!
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు, వాటి ఫలితంగా జరుగుతున్న ఘోరాలు తీవ్ర భయాందోళనలు కలిగించడంతో పాటు మాయమైపోతున్న మానవ సంబంధాలను ఎత్తి చూపుతున్నాయి.
By: Raja Ch | 22 Dec 2025 11:30 AM ISTఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు, వాటి ఫలితంగా జరుగుతున్న ఘోరాలు తీవ్ర భయాందోళనలు కలిగించడంతో పాటు మాయమైపోతున్న మానవ సంబంధాలను ఎత్తి చూపుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇంతకాలం భార్య, భర్త, ప్రియుడు, ప్రియురాలు వీటిలో కీలక పాత్రదారులైతే.. తాజాగా తెరపైకి వచ్చిన ఓ ఘటనలో ఓ వ్యక్తి తండ్రి, అతని భార్య సూత్రదారులు కావడం గమనార్హం!
అవును... రోజురోజుకీ మాయమైపోతున్న మానవ సంబంధాలను ఎత్తి చూపుతూ.. మనిషిలో మానవత్వం రోజు రోజుకీ చచ్చిపోతుందనే విషయాన్ని నొక్కి చెబుతూ ఉన్న ఓ ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో.. కోడలి మాయలో పడి, అలవాటు పడిన ఓ తండ్రి.. స్వయంగా కన్న కొడుకునే మనుషులను పెట్టి కడతేర్చాడు.. ఆఖరికి దొరికిపోయాడు.
వివరాళ్లోకి వెళ్తే... కరీనంగర్ జిల్లా రామడుగుకు చెందిన అంజయ్యకు 15 ఏళ్ల క్రితమే వివాహం అయ్యింది. తండ్రి లచ్చయ్య, భార్యతో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో 2017లో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. ఇలా భర్త తన కోసం, తన కుటుంబ కోసం దేశం విడిచి దేశం వెళ్లి కష్టపడుతున్నాడే జ్ఞానం ఆ భార్యకు లేకపోయినట్లుంది.
ఇదే సమయంలో... ఓ పక్క కొడుకు విదేశాల్లో కష్టపడుతున్నాడు, ఆ సమయంలో కూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేయడం పాపం అనే సంస్కారం లేకపోయింది అతనికి. ఈ క్రమంలో... ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు! ఇద్దరి మధ్యా సభ్యసమాజం తలదించుకునే బంధం ఏర్పడింది. అయితే.. రెండేళ్ల తర్వాత ఇంటికొచ్చిన అంజయ్యకు ఈ విషయం తెలిసిపోయింది.
దీంతో.. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందనుకున్నాడో ఏమో కానీ.. అటు తండ్రిని, ఇటు భార్యను మందలించాడు. అయినప్పటికీ వారి తీరు మారకపోవడంతో పంచాయతీ పెట్టించాడు. అయినప్పటికీ వారి తీరు మారినట్లు లేదు. ఈ సమయంలో కూతురులాంటి కోడలి మైకంలో పడిన లచ్చయ్య ఏకంగా కన్న కొడుకునే అడ్డు తొలగించుకోవాలని భావించాడు.. బలంగా ఫిక్సైపోయాడు!
వెంటనే రవి అనే వ్యక్తితో చర్చలు జరిపాడు.. ఆ రవేమో కోటేశ్వర్, అబ్రార్ అనే ఇద్దరు వ్యక్తులను లచ్చయ్యకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో అంతా కలిసి అంజయ్యకు దగ్గరయ్యారు.. కలిసి మద్యం సేవించడం చేసేవారు. ఇలా అంజయ్యకు తమపై పూర్తి నమ్మకం వచ్చే వరకూ ఎదురుచూసిన ఆ బ్యాచ్... ఒక రోజు ఫుల్లుగా మద్యం తాగించారు.
ఆ మద్యం మత్తులో ఉండగానే అంజయ్య గొంతు నులిమి చపేశారు. అనంతరం శవాన్ని కాలువలో పడేశారు. ఈ క్రమంలో.. మరుసటి రోజు మాత్రం ఏమీ తెలియనట్లుగానే కోడలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు లచ్చయ్య. ఈ సమయంలో కాలువలోని మృతదేహాన్ని గాలించి వెలికితీసిన పోలీసులకు పోస్టు మార్టం రిపోర్టులో అనుమానం వచ్చింది. దీంతో అంజయ్య తండ్రి, భార్యపై పోలీసులు నిఘా పెట్టారు.
అయితే.. తన కొడుకును చంపేందుకు రూ.3 లక్షల సుపారీ మాట్లాడుకున్న లచ్చయ్య.. ఇప్పటికే రూ.1.25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో తాజాగా మిగతా డబ్బు కోసం లచ్చయ్య ఇంటికొచ్చారు కోటేశ్వర్, అబ్రార్. దీంతో వారందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేస్తే మొత్తం విషయం బయటకు వచ్చిందని తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి అలా ఉంటే... ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం... సమాజంలో బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, రక్త సంబంధాలు అనేవి వాటి వాటి రూపాలను మార్చుకుని.. వినాశనం దిశగా వేగంగా ముందుకు కదులుతున్నట్లున్నాయనే సందేహం మాత్రం కలుగుతుందని చెప్పొచ్చు!!
