రేవంత్‌కు ఇన్సల్ట్ జరిగిందా?.. ఏంటీ చర్చ!
అయితే.. ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా.. జాతీయస్తాయిలో తమ డిమాండ్‌ను చర్చించేలా చేయాలని ప్లాన్ చేశారు.
By: Garuda Media | 7 Aug 2025 10:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవమానం జరిగిందా? ఆయన ఆవేదన చెందారా? అంటే.. ఔననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా కామెంటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్రం బిల్లుకు అడ్డు పడుతోందన్న వాద నను రేవంత్ రెడ్డి వినిపిస్తున్నారు.
అయితే.. ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా.. జాతీయస్తాయిలో తమ డిమాండ్‌ను చర్చించేలా చేయాలని ప్లాన్ చేశారు. అది జరిగింది. ఇక, ఈ పరిణామాలు ఇలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయి.. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. దీనికి గాను.. ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే.. పక్కా ప్రూఫులు, బీసీలపై చేయించిన కులగణన రిపోర్టు.. వంటివాటిని కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. రాష్ట్రపతి ఏం కోరినా సమర్పించేలా అధికారులనుకూడా రెడీ చేశారు.
అయితే.. రాష్ట్రపతి అప్పాయింట్‌మెంటు విషయంలోనే సీఎం రేవంత్‌కు ఇన్సల్ట్ జరిగిందనే చర్చ తెర మీదికి వచ్చింది. తొలుత రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పాయింట్‌మెంటును ఖరారు చేస్తూ.. సమా చారం అందినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ.. గంటలోనే ఈ సమాచారం డిలీట్ కావడం.. దీనిపై ఎలాం టి అప్‌డేట్ లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. రాష్ట్రపతి అప్పాయింట్మెంటుపై ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు.
రాష్ట్రపతి అప్పాయింట్‌మెంటు ఇచ్చే విషయంలోనూ కేంద్ర పెద్దలుజోక్యం చేసుకుంటున్నా రని అన్నా రు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదరని.. రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించే వారిని కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు రోజులు గడుస్తోందని.. రాష్ట్రపతి అ ప్పాయింట్‌మెంటు కోసం వేచి చూస్తున్నామని అన్నారు. ఈ పరిణామాలపై ఇటు కాంగ్రెస్ పార్టీ నాయ కులు.. అటు విపక్ష నాయకులు కూడా అవమానం జరిగిందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎప్పటికి రేవంత్‌కు రాష్ట్రపతి అప్పాయింట్‌మెంటు లభిస్తుందో చూడాలి.
