Begin typing your search above and press return to search.

ఇరవయ్యేళ్ళు...మూడు సభలు...రేవంత్ రికార్డు !

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల సర్వామోదంతోనే గెలిచారు. తన రెక్కల కష్టంతోనే ఆయన అరుదైన ఆ అందలం చేరుకున్నారు.

By:  Satya P   |   5 July 2026 7:47 AM IST
ఇరవయ్యేళ్ళు...మూడు సభలు...రేవంత్ రికార్డు !
X

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల సర్వామోదంతోనే గెలిచారు. తన రెక్కల కష్టంతోనే ఆయన అరుదైన ఆ అందలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ వంటి సముద్రం లాంటి పార్టీలో ఎంతో మంది కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి 55 ఏళ్ళ వయసులో ఆ చాన్స్ ని అందుకున్నారు. రాజకీయంగా చూస్తే రేవంత్ తక్కువ వయసులోనే సీఎం పదవిని అందుకున్నట్లుగా లెక్క. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ ఏజ్ ప్రకారం చూసినా చాలా తొందరగానే కీలకమైన సీఎం పీఠాన్ని అధిరోహించారు అని కూడా చెప్పుకోవాలి.

రేర్ ఫీట్ సాధించారు :

రేవంత్ రెడ్డి 2006 జూలై 4న స్థానిక సంస్థల నుంచి ఒక జెడ్పీటీసీగా గెలిచారు. అది కూడా ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి కాదు తానుగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విక్టరీ కొట్టడం అంటే రేవంత్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఆది లోనే గ్రేట్ అని ఆ సక్సెస్ తేల్చింది అని అంటున్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలిచిన రేవంత్ ఆ తరువాత వెంటనే ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక 2009లో ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2014లో రెండోసారి గెలిచారు. 2018 లో ఓడినా ఆ మరుసటి ఏడాది 2019లో ఏకంగా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ నుంచి ఎంపీ అయ్యారు. 2023 కి వచ్చేసరికి ముఖ్యమంత్రి అయిపోయారు.

మూడు సభలలోనూ :

ఇక రేవంత్ రెడ్డి ఇరవయ్యేళ్ళ రాజకీయ జీవితం చూస్తే కేవలం ఇరవై ఏళ్ళ కాలంలో మూడు చట్ట సభలలో మెంబర్ గా పనిచేసిన ఘనత సాధించినట్లుగా అర్ధం అవుతుంది. ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారు, ఇక ఆయన అడుగుపెట్టని సభ ఒక్కటే ఉంది. అదే రాజ్యసభ. ఏమో ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల వైపు చూసినపుడు రాజ్యసభలోనూ మెరుస్తారేమో చూడాల్సి ఉంది. ఎంతో లాంగ్ పొలిటికల్ హిస్టరీ ఉన్న వారు సైతం ఇన్ని సభలలో కనిపించలేదు. మహా అయితే ఎంపీ ఎమ్మెల్యే అయిన వారు ఉన్నారు. కొందరు అయితే ఎమ్మెల్యేగానే తమ జీవితం మొత్తం పనిచేసిన సందర్భం కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలోనే అన్ని సభలూ చూశారు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాల్సి ఉంటుంది.

కష్టంతో పాటు అన్నీ :

రేవంత్ రెడ్డి షార్ట్ కట్స్ ని నమ్ముకోలేదు, కష్టాన్ని నమ్ముకున్నారు అని ఆయన పొలిటికల్ జర్నీ చూసిన వారికి అర్ధం అవుతుంది. ఆయన చురుకైన నాయకత్వం అలాగే మంచి వాగ్దాటి, ఎలాంటి ఇగోలకు పోకుండా అందరినీ కలుపుకుని పోయే తత్వం, సమస్యలను సాకల్యంగా అర్ధం చేసుకుని పరిష్కారాలని వెతికే గుణం ఏ పార్టీలో ఉన్న నిబద్ధతతో అధినాయకత్వం చెప్పిన తీరుగా పనిచేసి మంచి మార్కులు అందుకోవడం ఇవన్నీ రేవంత్ రెడ్డిని ఇంతటి స్థాయికి తెచ్చాయని చెప్పాల్సి ఉంటుంది. ఆయన విజయాలు ఆయన రాజకీయ జీవితం అయితే ఎంతో మంది వర్ధమాన రాజకీయ నాయకులకు ఆదర్శం అని చెప్పాల్సి ఉంటుంది.

మిడ్జిల్ నాటిన మొక్క :

ఇదిలా ఉంటే తాను తొలిసారిగా గెలిచిన జెడ్పీటీసీ ప్రాంతం అయిన మిడ్జిల్ కి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ సభ పెట్టి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం కూడా మంచి సంస్కారవంతమైన విధానంగా కనిపిస్తుంది. ఈ రోజులలో చాలా మంది అలవరచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయంగా దీనిని చూడాలి. తాను ఎక్కడ నుంచి వచ్చానో మూలాలను గుర్తు చేసుకోవడం అక్కడ ప్రజల పట్ల సదా కృతజ్ఞతగా ఉండడం రేవంత్ రెడ్డిలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఏది ఏమైనా రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలోనే ఇంత దాకా వచ్చిన రేవంత్ రెడ్డి మరో రెండు దశాబ్దాల పాటు రాజకీయాలను చురుకుగా చేయాలని అనుకుంటున్నారు. దాంతో ఆయన ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.