Begin typing your search above and press return to search.

బీసీ కార్డ్‌తో రేవంత్ మాస్టర్ ప్లాన్?

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారింది బీసీ వర్గాల అసంతృప్తి. రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ఉన్న బీసీలకు అధికారంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావన గట్టిగా వినిపిస్తోంది.

By:  A.N.Kumar   |   26 May 2026 5:00 AM IST
బీసీ కార్డ్‌తో రేవంత్ మాస్టర్ ప్లాన్?
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి క్యాబినెట్ విస్తరణ తుఫాన్ రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రావడం, అధిష్ఠానంతో కీలక చర్చలు జరపడంతో ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల 15 లోపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయేది సాధారణ విస్తరణ కాదు. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పక్కా సామాజిక సమీకరణాలతో రేవంత్ రెడ్డి వేస్తున్న ఒక ‘పాలిటికల్ మాస్టర్ ప్లాన్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీసీ కార్డ్‌తో అసంతృప్తికి చెక్!

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారింది బీసీ వర్గాల అసంతృప్తి. రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ఉన్న బీసీలకు అధికారంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావన గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల బీసీ కులగణన చర్చలు, బీసీ సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి కాంగ్రెస్‌పై భారాన్ని పెంచాయి. ఇటీవల “మరోసారి నేనే సీఎం అవుతా” అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీసీ వర్గాల్లో కొంత చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌లో నిర్ణయాధికారం మళ్లీ కొద్ది వర్గాలకే పరిమితం అవుతోందన్న విమర్శలు వచ్చాయి. దీనికి కౌంటర్‌గా ఈసారి మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా కీలక శాఖలను కేటాయించి ఆ అసంతృప్తిని పూర్తిగా చల్లార్చాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇది కేవలం పదవుల పంపకం కాదు, బీసీ ఓటు బ్యాంకునే టార్గెట్ చేస్తూ పంపే బలమైన ‘సోషల్ మెసేజ్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పరిమిత అవకాశాలు.. ఇక ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విషయానికి వస్తే, ఈసారి కొత్తగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రాంతీయ సమీకరణాలు, వర్గ సమతుల్యతను బట్టి ఒకటి లేదా రెండు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేము.

రెడ్డి వర్గం వర్సెస్ సోషల్ బ్యాలెన్సింగ్

ప్రస్తుత ప్రభుత్వంలో పార్టీలో రెడ్డి నాయకుల ప్రాధాన్యం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉంది. అయినప్పటికీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గ నేతల జాబితా చాలా పెద్దదే ఉంది.

రాజ్‌గోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కేనా?

ముఖ్యంగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయనకు ఈసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందా? లేక సామాజిక సమీకరణాల పేరుతో బీసీ, ఇతర వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన్ను పక్కన పెడతారా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది. దాదాపు రెండున్నరేళ్ల పాలన పూర్తి కావస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ విస్తరణ, రేవంత్ సర్కార్‌కు కేవలం పరిపాలనా అవసరం మాత్రమే కాదు. ఇది 2028 అసెంబ్లీ ఎన్నికల దిశగా వేస్తున్న వ్యూహాత్మక అడుగు. కేవలం సీనియారిటీని మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి లాభం చేకూర్చే సమీకరణాల ఆధారంగానే ఈసారి ‘రేవంత్ టీమ్’ సిద్ధం కాబోతోంది. భవిష్యత్తు రాజకీయాలపై ఈ మాస్టర్ ప్లాన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!