Begin typing your search above and press return to search.

హలో టీ బీజేపీ లీడర్స్...ఏమైంద్ర బై మీకు...?

2028 లక్ష్యంగా పనిచేయాల్సిందిగా ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు క్లాసులు పీకుతుంటే...ఇక్కడ తెలంగాణలో మాత్రం నేతలు తమకు నచ్చినట్టుగా చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   15 Dec 2025 5:00 PM IST
హలో టీ బీజేపీ లీడర్స్...ఏమైంద్ర బై మీకు...?
X

అరె... ఏమైంద్ర బై మీకు? మొన్నటిదాకా దోస్తానా బాగుండేది కదా...గిపుడు ఈ లొల్లేంటి? సోషల్ మీడియాలో వారేంటి? గిట్లయితే సానా కష్టమని ఎర్కజేసుకుండ్రి జర. .అంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2028 లక్ష్యంగా పనిచేయాల్సిందిగా ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు క్లాసులు పీకుతుంటే...ఇక్కడ తెలంగాణలో మాత్రం నేతలు తమకు నచ్చినట్టుగా చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ప్రమాదకరంగా మారుతున్నాయని వారు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే...తెలంగాణలో బీజపీ చెప్పుకోదగ్గ ఫలితాలనే రాబట్టింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి పొలిటికల్ బేస్ బాగానే ఉంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది పార్టీ పరిస్థితి. గత అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం చాలా పెరిగింది. దీన్ని మరింత పెంచుకోవల్సింది పోయి...స్థానిక నేతలు వారిలో వారు చిన్నపిల్లల్లా కుమ్ములాడుకుంటున్నారు.

తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. నేతలు వాదులాడుకోవడం...కుమ్ములాడుకోవడం దాటి సోషల్ మీడియా వేదిక చేసుకునని ఒకరిపైఒకరు బురద చల్లుకుంటున్నారు. ఈ వ్యవహారం మింగుడు పడక పార్టీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. దీంతో అగ్రనాయకత్వం గుస్సా అయ్యింది. ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. పార్టీ నేతలు ఆధిపత్యధోరణితో వ్యవహరిస్తూ పెడుతున్న పోస్టుల వెనక సీనియర్ల హస్తం ఉందన్న అనుమానాలు వినవస్తున్నాయి. మారక్తంలోనూ బీజేపీ ఉందని నిత్యం గొప్పలు చెప్పుకునే నేతలు సైతం ఘోరంగా పార్టీ మీద పోస్టులు పెట్టడాన్ని అధినాయకత్వం జీర్ణించుకోలేక పోతోంది. ఎలాగైన సరే దీనికి అడ్డుకట్ట వేసేందుకే సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ పరువు తీసేవారు ఎంతటి నాయకులైనా వదిలే ప్రసక్తే లేదన్నట్లు గా అధినాయకత్వం వ్యవహరిస్తోంది. వెంటపడి మరీ పోస్టుల్ని డిలిట్ చేయిస్తోంది. ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పోస్టులు అవసరమా అని ప్రశ్నస్తుంది. పోస్టుల్ని డిలిట్ చేయించడమ కాకుండా...పోస్ట్ పెట్టిన వారిని ఢల్లీకి బులావ్ అని పిలిపించుకుని మందలిస్తోంది. పార్టీ నేతలే సొంత టీములు ఏర్పాటు చసుకుని తమకు నచ్చని నేతలపై కామెంట్లు పెడుతున్నారని నాయకత్వం దృష్టికి వచ్చిన దరిమిలా...పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్ గా ఉంటోంది. అసలు ఎవరు ఇలా పోస్టులు పెడుతున్నారు? వీరికి అ అవసరం ఏంవచ్చిందని పార్టీ పెద్దలు ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు తెలిసినట్లు అర్థమవుతోంది. తీగ లాగితే డొంకంతా కదలినట్లు విద్వేష పోస్టుల వెనక పార్టీ పెద్ద తలకాయలే ఉంటుండటంతో అధినాయత్వానికి తలపట్టుక్కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ పార్టీలో ఉన్నవారిపైనే అన్యాయంగా పోస్టులు పెట్టేవారిపైన కచ్చితంగా కఠిన చర్యలుంటాయని అధిష్టానం అంటోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు...2028 నాటికి ప్రజల్లో హిందుత్వ భావనల్ని బలంగా తీసుకెళ్ళడం...మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం...ప్రజలకు బీజేపీ తప్ప మరో ప్రత్యమ్నాయం లేదన్నంత మంచిగా పాలించడం ..ఇవీ ఇపుడు బీజేపీ ముందున్న లక్ష్యం. అయితే ఒ వైపు పార్టీని మరింత పటిష్టపరచి మరోసారి దేశంలో అధికారంలోకి రావాలని, రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆలోచిస్తుంటే...తెలంగాణ బీజేపీలో ముఠా తగాదాలు...సోషల్ మీడియా వార్ పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుతోపాటు మరికొందరు నేతలపై దుష్ప్రచారంతో పోస్టులు పెట్టడం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధిష్టానం సీరియస్ అవుతోంది. తెలంగాణ గల్లీలో నేతలు పోరాడినా...ఢిల్లీ దాకా పార్టీ ప్రకంపనలు ఉంటాయని వారంటున్నారు. కార్యకర్తల మనోభావాలు ఘోరంగా దెబ్బతిని వారు మౌనంగా ఉండిపోయే ప్రమాదమున్నందున అధిష్టానం రంగంలో దిగక తప్పలేదు. మరి ఈ తుపాను టీకప్పులో తుపానుగా మిగిలిోతుందా? లేదా తెలంగాణలో పార్టీని ఘోరంగా దెబ్బతీస్తుందా అనేది వేచి చూడాల్సిందే.