బీజేపీలో 'బాల్' రాజకీయం!
ఇక, ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా.. స్పందించారు. పార్టీ నాయకులను ఇలానే ఆడుకోవాలన్నారు.
By: Garuda Media | 28 Aug 2025 6:00 AM ISTతెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఫుట్ `బాల్` రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్టీ కార్యాలయాని కి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్ బాల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై అంతర్గతంగా పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలపై అసతృప్తితోనే ఆయన ఫుట్‌బాల్ తీసుకువచ్చారని.. ఇక నుంచి తాను ఫుట్ బాల్ ఆడుకుంటానన్న సంకేతాలు ఇచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. నాయకుల వ్యవహార శైలిపై విసుగు చెందే కొండా ఇలా చేసి ఉంటారని అన్నారు.
ఇక, ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా.. స్పందించారు. పార్టీ నాయకులను ఇలానే ఆడుకోవాలన్నారు. ఇక, నుంచి పార్టీ కార్యాలయాలు ఫుట్ బాల్ ఆటకు వేదికగా మారనున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తనను కూడా తీవ్రంగా అవమానించారంటూ.. ఆయన గతం సంగతులు చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. తాను ఫుట్ బాల్ తీసుకురావడంపై ఎంపీ కొండా స్పందించా రు. తన ఉద్దేశం వేరని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ కాంగ్రెస్‌తో తమ పార్టీ నాయకులు ఎలా వ్యవహరించాలో చెప్పేందుకే తాను ఫుట్ బాల్ తచ్చానన్నారు.
కాంగ్రెస్‌ను గట్టిగా ఎదిరించి నిలబడాలని.. పార్టీ అధికారంలోకి రావాలంటే.. మరింత తెగువ చూపించాల ని కొండా చెప్పుకొచ్చారు. అందుకే తాను ఫుట్ బాల్‌ను సింబాలిక్‌గా తీసుకువచ్చినట్టు తెలిపారు. ``కాంగ్రె స్‌తో ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో చెప్పేందుకే తీసుకొచ్చా`` అని చెప్పారు. ప్రస్తుతం రెండే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల బీఆర్ ఎస్‌ను ఎప్పుడో బట్టదాఖలు చేశారని.. ఇక, ఆ పార్టీ గురించి మాట్లాడడం కూడా వేస్టన్నారు. కేవలం కాంగ్రెస్-బీజేపీల మధ్యే రాజకీయం నడుస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయంగా కాంగ్రెస్‌ను గట్టిగా ఎదుర్కొంటే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని కొండా చెప్పుకొచ్చారు. అందుకే తాను ఫుట్ బాల్‌ను తీసుకువచ్చానన్నారు. ఫుట్‌బాల్ మాదిరిగా ఆడితేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుని, అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తన లాంటి నాయకులకు నిద్రపట్టదని వ్యాఖ్యానించారు. అయితే.. మంగళవారం పార్టీ కార్యాలయానికి కొండా ఫుట్ బాల్ తీసుకువచ్చిన వ్యవహారంపై బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ క్రమంలో వేడి పెరుగుతున్నట్టు గ్రహించిన ఎంపీ.. దీనిని తప్పించుకునేందుకు ఇలా వివరణ ఇచ్చారన్న చర్చ కూడా సాగుతోంది.
