డిప్యూటీ స్పీకర్ పోస్టు ఉన్నట్టా.. లేనట్టా?
ఇది కూడా అసెంబ్లీలోని సభ్యులలో 2/3 వంతు సభ్యుల మెజారిటీతోనే అనుమతిస్తారు. తెలంగాణ విష యాన్ని చూస్తే.. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు.
By: Garuda Media | 3 May 2026 6:00 PM ISTదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోనూ.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులు ఉంటాయి. రాజ్యాంగ బద్ధమైన ఈ పోస్టుల ద్వారానే అసెంబ్లీ కార్యక్రమాలు కొనసాగుతాయి. వాస్తవానికి స్పీకర్ పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన పోస్టు. డిప్యూటీ స్పీకర్‌కు పూర్తిస్థాయి రాజ్యాంగ పరమైన రక్షణ లేకపోయినా.. రాజ్యాంగ బద్ధమైన పదవినిగానే భావిస్తారు. స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత.. వారం పది రోజుల్లో దీనిని ఎంపిక చేస్తారు.
ఇది కూడా అసెంబ్లీలోని సభ్యులలో 2/3 వంతు సభ్యుల మెజారిటీతోనే అనుమతిస్తారు. తెలంగాణ విష యాన్ని చూస్తే.. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు. కానీ, డిప్యూటీ స్పీకర్ విషయంపై ఇప్పటి వరకు ఎలాం టి ప్రతిపాదనా లేదు. రాజ్యాంగ బద్ధం కాదని వదిలేస్తున్నారో.. లేక, మరే కారణమో తెలియదు కానీ.. 2023 చివరిలో ప్రభుత్వం ఏర్పడినా.. ఇప్పటి వరకు ఈ పదవిని భర్తీచేయలేదు. కానీ. ఈ పదవి కోసం కూడా అనేక మంది నాయకులు ఎదురు చూస్తున్నారు.
వీనిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కూడా కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి ని లేకుండానే నడిపించే ప్రయత్నం చేశారు. కానీ, పనుల ఒత్తిడి, అసెంబ్లీ వ్యవహారాల పనితీరు వంటివి ఇబ్బందిగా మారడంతో చివరాఖరుకు.. మొక్కుబడిగా ఈ పదవిని భర్తీ చేయడం గమనార్హం. మరి ఇప్పు డున్న ప్రభుత్వం కూడా అలానే ఆలోచన చేస్తోందా? లేక.. ఎందుకులే అని వదిలేస్తోందా? అనేది చూడా లి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో చర్చకు వచ్చింది.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఒకరికి ఈ పదవిని ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా.. మంత్రివర్గానికి ఉన్న పోటీని నిలువరించుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయాలని పార్టీ నుంచి సూచ నలు వస్తున్నాయి. కానీ, ఇది సభా నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన ఓకే అంటే.. వెంటనే అసెంబ్లీలో చర్చించి.. డిప్యూటీ స్పీకర్ ఎంపిక కార్యక్రమాన్ని చేపడతారు. గతంలో ఈ ప్రదిపాదన వచ్చినా. ఎంపిక విషయం ఆగిపోయింది. మరి ఇప్పటికైనా ఈ పోస్టును భర్తీ చేస్తారా? లేక వదిలేస్తారా? అనేది చూడాలి.
