దేశంలో పని చేసే వయసున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు
అలాంటి రాష్ట్రాల జాబితాను చూసినప్పుడు మొదటి మూడు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం విశేషం.
By: Garuda Media | 23 Sept 2025 10:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసింది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ రాష్ట్రాల్లో పని చేసేటోళ్లు అత్యధికంగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం వావ్ అనిపించే అంశంగా చెప్పొచ్చు. దేశ జనాభాలో పని చేసే వయసున్న ప్రజల్లో మూడింట రెండు వంతుల వారు ఉండటం ఒక వరమైతే.. మరో ఆసక్తికర అంశం.. అలాంటి రాష్ట్రాల జాబితాను చూసినప్పుడు మొదటి మూడు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం విశేషం.
మొత్తం దేశ జనాభాలో 66 శాతం మంది పని చేసే వయసు 15-59 వయసున్న వారే. ఇలా పని చేసే వయసున్న వారిలో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. బాలల విభాగంలో జనాభా భారీగా తగ్గిపోయింది. దేశ మొత్తం జనాభాలో0-14 ఏళ్ల వయసున్న విభాగంలో కేవలం 24.2 శాతం జనాభా ఉన్నట్లుగా గుర్తించారు.
అదే సమయంలో పని చేసే విభాగంలో జనాభా సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రిపోర్టు ప్రకారం చూస్తే.. ఢిల్లీలో 70.8 శాతం మంది పని చేసే వయసులో ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రంలో పని చేసే వయసున్న వారు 70.2 శాతం. ఇక.. ఏపీలో 70.1 శాతం ప్రజలు ఉన్నారు. అంటే.. టాప్ త్రీలో నిలిచిన మూడు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా లేకపోవటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఈ గణాంకాల్ని జాతీయ స్థాయిలో చూస్తే.. దేశంలో మొత్తం జనాభాలో పట్టణ వర్కింగ్ ఏజ్ గ్రూపు జనాభా 68 శాతంగా వెల్లడైంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో వర్కింగ్ వయసు వాళ్లు 64 శాతంగా నమోదైంది. ఇదంతా బాగానే ఉన్నా.. రానున్న పదిహను - పాతికేళ్లలో మొత్తం మారిపోవటమే కాదు.. పెద్ద వయస్కుల వారి సంఖ్య భారీగా ఉండి.. కొత్త సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే పరిష్కార మార్గాల్ని వెతకాల్సిన అవసరం పాలకుల మీద ఉందని చెప్పాలి.
