Begin typing your search above and press return to search.

గుమ్మడి సంధ్యారాణికి ఆమెతో చెక్ పెట్టారా ?

తెలుగుదేశం పార్టీ కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. అలా కొత్త వారికి చాన్స్ ఇచ్చింది.

By:  Satya P   |   22 Dec 2025 1:00 PM IST
గుమ్మడి సంధ్యారాణికి ఆమెతో చెక్ పెట్టారా ?
X

తెలుగుదేశం పార్టీ కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. అలా కొత్త వారికి చాన్స్ ఇచ్చింది. వీరంతా రానున్న రోజులలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే కనుక పార్టీ పరంగా మరిన్ని అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మందికి అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్న వారికి పోటీగా కొందరికి తెర మీదకు తెచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది.

సాలూరులో పోటీ :

ఇదిలా ఉంటే సాలూరులో కీలక నేత మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణికి పోటీకి ఒక మహిళా నాయకురాలిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. దీని వెనక మన్యం జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు చక్రం తిప్పారని చెబుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే మోజోరు తేజోవతి. ఆమె గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. రాజకీయాల మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చి పార్టీలో చేరారు. ఆమెకు ఇపుడు అరకు పార్లమెంట్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె దూకుడుగా రాజకీయం చేస్తారని ఆమె వల్ల మంత్రికి ఫ్యూచర్ లో ఇబ్బందే అని ప్రచారం సాగుతోంది.

గ్రౌండ్ లెవెల్ లోకి :

ఇక కొత్తగా పదవి అందుకున్న మోజోరు తేజోవతి గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు అని అంటున్నారు. మొత్తం నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమె కలియతిరగడమే కాదు పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషిని ఒక నాయకురాలిగా ఇప్పటికే చేస్తూ వచ్చారు అని చెబుతున్నారు. దాంతో ఆమె సమర్ధతను చూసే అధినాయకత్వం ఈ పదవికి కోరి మరీ ఎంపిక చేసింది అని చెబుతున్నారు.

టికెట్ కోసం :

ఇక చూస్తే మోజోరు తేజోవతి 2024 ఎన్నికల్లోనే సాలూరు టికెట్ కోసం పోటీ పడ్డారు. చివరి నిముషంలో అది గుమ్మడి సంధ్యారాణీకి దక్కింది. అయితే ఇప్పటికే సంధ్యారాణికి చాలా అవకాశాలు దక్కాయి, ఇపుడు మంత్రి కూడా అయ్యారు, మంత్రిగా ఆమె పనితీరు మీద సైతం విమర్శలు ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు వర్గ పోరు కూడా జిల్లాలో ఎక్కువగా ఉంది. అదే విధంగా ఆమె సొంత నియోజకవర్గంలో సీనియర్ నేతలు కూడా రగులుతున్నారు. వీటి నేపధ్యంలో వ్యూహాత్మకంగానే తోజోవతిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఒక విధంగా సంధ్యారాణికి చెక్ మేట్ గానే ఈమెను తెచ్చారా అన్న డౌట్లూ ఉన్నాయని అంటున్నారు.

అందులో విఫలం :

ఇక చూస్తే ఇప్పటిదాకా ఈ పదవిలో కిడారి శ్రావణ్ కుమార్ ఉండేవారు. ఆయనకే మరోసారి ఈ కీలక పదవిని ఇప్పించాలని మంత్రిగా సంధ్యారాణి చివరి వరకూ ప్రయత్నం అయితే చేశారు అని అంటున్నారు. కానీ ఆమె ఇందులో విఫలం అయ్యారని ఆమె ప్రత్యర్ధిగా తేజోవతి ముందుకు రావడం అయితే మంత్రి వర్గీయులకు మింగుడు పడడం లేదని అంటున్నారు. అయితే జిల్లా మొత్తాన్ని ఏక త్రాటి మీద చూసుకుంటూ పార్టీని ఏజెన్సీలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత తేజోవతి మీద కూడా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో అరకు పార్లమెంట్ పరిధితో పాటు సాలూరులో రాజకీయం ఏ విధంగా ఉంటుందో.