Begin typing your search above and press return to search.

సీరియ‌స్‌-చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌-ఆగ్ర‌హం: ఇంతేగా ..!

కానీ, అవ‌కాశం ఇచ్చార‌న్న కార‌ణంగా.. నాయ‌కుల‌ను చంద్ర‌బాబు వెనుకేసుకు వ‌స్తున్న‌ట్టు కాదు.

By:  Garuda Media   |   22 Aug 2025 4:00 PM IST
సీరియ‌స్‌-చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌-ఆగ్ర‌హం: ఇంతేగా ..!
X

- ఇవీ.. త‌ప్పులు చేస్తున్న‌ త‌మ్ముళ్ల‌కు సంబం ధించి టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంతేకాదు.. అనుకూ ల మీడియాలో పెద్ద ఎత్తున వ‌స్తున్న వార్త‌ల సారాంశం కూడా. కానీ.. ఎక్క‌డా చ‌ర్య‌లు తీసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో త‌ప్పులు చేసిన వారు లైట్ తీసుకుంటున్నారు. మిగిలిన వారు కూడా వీటినే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. దీంతో ఎక్క‌డా త‌మ్ముళ్లకు చెక్ ప‌డ‌డం లేద‌న్న‌ది తెలిసిందే.

తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖ‌ర్ వ్య‌వ‌హారం వెలుగు చూసిన త‌ర్వాత‌.. ఎక్కువ మంది చెప్పిన మాట ఏంటంటే.. ''బాబుగారు.. అలా అంటారు అంతే!. ఏం చేస్తారు. ఎవ‌రిని వదులుకుంటారు?'' అనే. మెజారిటీ నాయ‌కుల్లో ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. అయితే.. చంద్ర‌బాబు సీరియ‌స్ అవుతున్నా.. చ‌ర్య లు తీసుకోక‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. వారే తెలుసుకుంటారు అనే ఆలోచ‌న‌తో పాటు.. అంద‌రూ పెద్ద వాళ్లే అనే ఆలోచ‌న. ఈ రెండు కార‌ణాల‌తో ఆయ‌న దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకోలేక పోతున్నారున్న‌ది వాస్త‌వం.

కానీ, అవ‌కాశం ఇచ్చార‌న్న కార‌ణంగా.. నాయ‌కుల‌ను చంద్ర‌బాబు వెనుకేసుకు వ‌స్తున్న‌ట్టు కాదు. గ‌తంలో వైసీపీ నేత‌లు త‌ప్పు చేస్తే.. వెనుకేసుకువ‌చ్చిన ప‌రిస్థితి ఉంది. అప్ప‌టి ఎంపీ గోరంట్ల మాధ‌వ్ త‌ప్పు చేస్తే.. ఆయ‌న‌ను ఉపేక్షించారు. ఎమ్మెల్సీ అనంత‌బాబు త‌ప్పు చేస్తే.. క‌నీసం పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డానికి కూడా వారాల త‌ర‌బ‌డి స‌మ‌యం తీసుకున్నారు. ప‌న్నెత్తు హెచ్చ‌రిక కూడా చేయ‌లేదు. కానీ, అలా కాకుండా.. చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తున్నారు. మారాల‌ని కోరుతున్నారు.

ఈ సున్నిత విష‌యాన్ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌ను అర్ధం చేసుకోలేక పోతున్న త‌మ్ముళ్లు.. ''త‌ప్పులు చేసిన వారిని ఏం చేశారు? మేం చేస్తే మాత్రం త‌ప్పేముంది?'' అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామ మే వారికి ఆయుధంగా కూడా మారుతోంది. కానీ, ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అనేది ప్ర‌శ్న‌. హెచ్చ‌రిక లు, నివేదిక‌లు అని కోరుతున్నారంటే.. ఎమ్మెల్యేల స్థాయికి ఇవి కొర‌డా ఝ‌ళిపించిన‌ట్టే. కానీ, అర్ధం చేసుకునే వారు మాత్రం కొర‌వ‌డుతున్నారు. ఇలానే కొన‌సాగితే.. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌ష్టాలు ఖాయం అంటున్నారు సీనియ‌ర్లు.