వీళ్లు సర్దుకుపోరు.. వాళ్లు సర్ది చెప్పరు.. పొలిటికల్ ఫైట్.. !
కానీ, గెలిచిన నేతలు, ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయాన్ని.. తూ.చ. తప్పకుండా.. పక్కన పెట్టేశారు.
By: Garuda Media | 18 Aug 2025 7:00 PM ISTరాష్ట్రంలో సీనియర్ నాయకులకు, జూనియర్ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. వాస్తవానికి గ్యాప్ మం చిది కాదు. ఒకే పార్టీలో ఉన్న నాయకులకు మధ్య కూడా ఈ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన వారు.. సర్దుకుపోవడం లేదు. పాత నేతలు.. వారికి సర్దిచెప్పరు. దీంతో పొలిటికల్‌గా పార్టీల్లో ఫైటింగ్ అంత ర్గతంగా జోరుగా సాగుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఇక, జన సేన కూడా.. సీనియర్లు సహా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది.
అయితే.. క్షేత్రస్థాయిలో వీరంతా టికెట్లు త్యాగం చేసిన ఇతర పార్టీల నేతలు, లేదా సొంత పార్టీల నాయకు లు (టికెట్ వస్తుందని చివరి నిమిషం వరకు ఎదురు చూసి.. ఏర్పాట్లు చేసుకున్న నేతలు)తో కలిసి పోవాలి. ఇది జనసేన, టీడీపీ అధిష్టానాల నుంచి కూడా వస్తున్న సూచన. కానీ, క్షేత్రస్థాయిలో గెలిచిన వారికి.. వారికి టికెట్లు త్యాగం చేశామని చెప్పుకొంటున్న సీనియర్లకు కూడా.. పడడం లేదు. అంతేకాదు.. కొందరు పొరుగు పార్టీల నుంచి వచ్చి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఉదాహరణకు మైలవరం, నూజివీడు, కోవూరు(నెల్లూరు) వంటివి స్పష్టంగా ఉన్నాయి.
వీటికితోడు.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసి విజయం దక్కించు కున్న వారు ఉన్నారు. వీరిలో తిరువూరు, కొవ్వూరు, అనంతపురం అర్బన్ వంటివి ఉన్నాయి. ఇలాంటి నియోజక వర్గాల్లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. అయితే.. సీని యర్లను కలుపుకొని పోవాలని.. టీడీపీ, జనసేన అధిష్టానాలు.. ఎమ్మెల్యేలకు చెబుతున్నాయి. ఈ విషయం లో ఎలాంటి సందేహం లేదు. అవసరమైతే.. వారి నుంచి సలహాలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నాయి.
కానీ, గెలిచిన నేతలు, ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయాన్ని.. తూ.చ. తప్పకుండా.. పక్కన పెట్టేశారు. అంతేకాదు.. సీనియర్లను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. త్యాగాలపై కూడా.. చిన్న చూపు చూస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నాయకుల మధ్య వివాదాలు.. విభేదాలు పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ రేపుతున్నాయి. అందరూ కలివిడిగా ఉండాలన్న అధినేతల మాటలు.. నీటి మూటలుగా మారుతున్నాయి. ఇదే.. అసలు సమస్యగా మారిందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనిని పరిష్కరించేందుకు తరచుగా.. ఉమ్మడి సమావేశాలు అధిష్టానం స్థాయిలో జరిగితే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.
