Begin typing your search above and press return to search.

2025లో కూట‌మికి ఇదే తార‌క‌మంత్రం...!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2025లో తార‌క‌మంత్రం మాదిరిగా ప‌ఠించిన ఏకైక మంత్రం `15 ఏళ్ల ప్ర‌భు త్వం`. గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలి ఆరేడు మాసాలు కూడా ఈ వ్య‌వ‌హారం పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు.

By:  Garuda Media   |   27 Dec 2025 4:00 PM IST
2025లో కూట‌మికి ఇదే తార‌క‌మంత్రం...!
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2025లో తార‌క‌మంత్రం మాదిరిగా ప‌ఠించిన ఏకైక మంత్రం `15 ఏళ్ల ప్ర‌భుత్వం`. గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలి ఆరేడు మాసాలు కూడా ఈ వ్య‌వ‌హారం పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు. అంతేకాదు.. 2025 ఏడాది మే వ‌ర‌కు కూడా.. 15 సంవ‌త్స‌రాల కూట‌మి అనే మాటే వినిపించ‌లేదు. కానీ.. అనూహ్యంగా ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో తొలుత జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ విష‌యాన్ని ఫ‌స్ట్ ప్ర‌స్తావించారు. ఇక‌, అప్ప‌టి నుంచి 15 ఏళ్ల కూట‌మి తార‌క‌మంత్రంగా మారింది.

అప్ప‌టికి ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా కూట‌మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ కూట‌మిలో విభేదాలు వ‌స్తున్నాయ‌ని.. నాయ‌కులు విడిపోవ‌డం ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. నిజానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఆరేడు మాసాల్లో ఈ త‌ర‌హా ప‌రిస్థితి అయితే క‌నిపించింది. క్షేత్ర‌స్థాయి టీడీపీ-జ‌న‌సేన నాయకుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. వీటిని ఆస‌రా చేసుకున్న వైసీపీ.. కూట‌మి ఎక్కువ కాలం మ‌న‌లేద‌న్న ప్ర‌చారాన్ని తెర‌మీదికి తెచ్చారు.

దీనికి సంబంధించి క్షేత్ర‌స్థాయిలో ఉన్న కొన్ని లొసుగుల‌ను కూడా వైసీపీ నాయ‌కులు పెద్దవి చేసి చూ పించారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే జూన్‌లో నిర్వ‌హించిన జ‌నసేన పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సులో తొలిసారి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మి భ‌విత‌వ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రు ఉన్నా.. ఎవ‌రు లేకున్నా.. కూట‌మి మాత్రం 15 సంవ‌త్స‌రాలు ఇలానే బ‌లంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ఇక‌, ఆ త‌ర్వాత ఎక్క‌డ అవ‌కాశం వ‌స్తే.. అక్క‌డ‌.. కూట‌మి భ‌విత‌వ్యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఇక‌, కొన్నాళ్ల‌కు ఇదే మాట‌ను టీడీపీ కూడా అందిపుచ్చుకుంది. సీఎం చంద్ర‌బాబు నుంచి మంత్రి నారా లోకే ష్ వ‌ర‌కు 15 ఏళ్ల తార‌క మంత్రాన్ని ప‌ఠించ‌డం ప్రారంభించారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో కీచులాడుకు నే నాయ‌కుల విష‌యంలోనూ స్ప‌ష్టత ఇచ్చారు. ఇటు జ‌న‌సేన అయినా.. అటు టీడీపీ అయినా.. నాయ కులు క‌లివిడిగా లేక‌పోతే.. వారికే న‌ష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌ద్వారా.. 15 ఏళ్ల‌ కూట‌మిపై ఇరు పార్టీలు క‌ట్టుబాటు ను ప్ర‌ద‌ర్శించ‌డం.. ఈ ఏడాది విశేష‌మేనని చెప్పాలి. ఇక‌, ఈ విష‌యంలో బీజేపీ పైకి చెప్ప‌క‌పోయినా.. ద‌క్షిణాదిలో విస్త‌రించాల‌న్న ప్ర‌య‌త్నం ఉన్న నేప‌థ్యంలో బీజేపీ కూడా ఇదే పంథాలో ముందుకు సాగే అవ‌కాశం ఉంది.