Begin typing your search above and press return to search.

బాబు పవన్ మధ్యన ఏదో జరుగుతోందా...వైసీపీ అంచనాలు ఏమిటి ?

ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలుసు. కూటమి బలంగా ఉంటే వైసీపీకి ఓటమి తప్పదు.

By:  Satya P   |   9 Oct 2025 9:20 AM IST
బాబు పవన్ మధ్యన ఏదో జరుగుతోందా...వైసీపీ అంచనాలు ఏమిటి ?
X

ఏపీలో టీడీపీ జనసేనల మధ్యన ఏదో జరుగుతోందా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మధ్యన ఏదో తెలియని గ్యాప్ కంటిన్యూ అవుతోందా అంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఏదీ తేల్చి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే బాబు పవన్ ల గురించి తెలిసిన వారు ఆ విధంగా అంచనాని వెంటనే రారు. కాని విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం కూటమిలో చిచ్చు స్టార్ట్ అయిందని అది ఇపుడే మెల్లగా అంటుకుందని భావిస్తోంది అని అంటున్నారు.

వైసీపీ ధీమా అదేనా :

ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలుసు. కూటమి బలంగా ఉంటే వైసీపీకి ఓటమి తప్పదు. అది 2024 ఎన్నికల్లో రుజువు అయింది. దాని కంటే ముందు 2014 ఎన్నికల్లోనూ రుజువు అయింది. 2019లో మాత్రం కూటమి పార్టీలు విడిపోయి విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా బంపర్ విక్టరీని వైసీపీ కొట్టింది. 2029లో కూడా అదే జరుగుతుందని వైసీపీ చాలా గట్టి ధీమాతో ఉంది అని అంటున్నారు.

అసెంబ్లీ ఎపిసోడ్ చాలు :

ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్ ఒక్కటి చాలు అని కూటమి మెల్లగా చీలిపోవడానికి అని అంటున్నారు. అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం బాలయ్య చేసీ అనుచిత వ్యాఖ్యలు అయితే కూటమిలో కుంపటిని రాజేశాయని అంటున్నారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడంతో మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది కాస్తా సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనను పరామర్శ పేరుతో అన్నీ ముచ్చటించి వచ్చారు. అయినా పవన్ ముభావంగానే ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి

జగన్ ఏమి చెప్పారు :

ఇక ఈ ఎపిసోడ్ మీద వైసీపీ ఎక్కువగానే ఊహించుకుంటోంది అని అంటున్నారు తాజాగా తాడేపల్లిలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో అధినేత జగన్ ఈ విషయాన్ని కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావించారు అని అంటునారు కూటమిలో చిచ్చు మొదలైందని తొందరలో చీలిక వచ్చే చాన్స్ ఉందని కూడా అన్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే మెగా ఫ్యామిలీ బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల గుర్రుగా ఉందని ప్రస్తుతానికి పవన్ సర్దుకుని పోతున్న ఏదో నాటికి అది ముదిరి పాకాన పడుతుందని అంటున్నారు. ఇంకో వైపు బాలయ్య కూడా టీడీపీ అధినాయకత్వం తీరు మీద గుస్సాగా ఉన్నారని అంటున్నారు. ఈ విషయాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ హై కమాండ్ చాలా ఆశాభావంతో ఉందని అంటున్నారు 2029 ఎన్నికల నాటికి కూటమి పార్టీలు విడిపోతాయని వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నాయని చెబుతున్నారు.

అది జరిగే పనేనా :

అయితే ఒకసారి విడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బ తిన్న జనసేన కానీ టీడీపీ కానీ తిరిగి అలాంటి పని చేస్తాయా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే కళ్ళ ముందు 2019 ఫలితాలు ఉన్నాయని అంటున్నారు అంతే కాదు ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా వైసీపీ ఉందని జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో సీఎం కానీయకూడదు అన్నది కామన్ అజెండగా ఉందని అంటున్నారు. దాంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కచ్చితంగా కూటమి పార్టీలుగానే 2029లో పోటీ చేస్తాయని అంటున్నారు మరి వైసీపీ ఆశలు అంచనాలు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో వేచి చూడాల్సిందే.