యనమల వర్సెస్ కేఈ : గవర్నర్ పదవి ఎవరికి ?
ఇక తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఒక గవర్నర్ పోస్టుని బీజేపీ కేటాయించింది. విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్ గా నియమించారు.
By: Satya P | 21 Aug 2026 8:30 AM ISTవైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, కేఈ క్రిష్ణ మూర్తిలలో ఒకరికి రాజయోగం రాజ్ భవన్ యోగం పట్టనుంది అని అంటున్నారు. ఈ ఇద్దరూ 1983 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా పనిచేసిన వారు. యనమల అయితే స్పీకర్ గా కూడా తనదైన శైలిలో సేవలు అందించారు. గోదావరి జిల్లాకు చెందిన యనమలకు అదే విధంగా రాయలసీమకు చెందిన కేఈ క్రిష్ణమూర్తి ఇద్దరూ చంద్రబాబుకు మంచి స్నేహితులు, సన్నిహితులు, టీడీపీలోనే వారు కొనసాగుతూ వచ్చ్చారు. ఇక యనమల అయితే గత ఏడాది ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో మాజీ అయిపోయారు. కేఈ 2019 తరువాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఇద్దరి సీనియర్ల విషయంలో తగిన న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉందని అంటున్నారు.
కేంద్రం హామీ :
ఇక ఏపీలో టీడీపీ నుంచి ఏకంగా 17 మంది ఎంపీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దాంతో పాటుగా క్లిష్ట సమయంలో సహకరిస్తున్నారు. దాంతో టీడీపీ పట్ల బీజేపీ పెద్దలకు సానుకూల అభిప్రాయం ఎంతగానో ఉంది అని అంటున్నారు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినపుడు కేంద్ర పెద్దలను కలసి తమకు ఒక గవర్నర్ పోస్టు కావాలని కోరారని చెబుతున్నారు. దానికి కేంద్రం కూడా అంగీకరించింది అని అంటున్నారు. తొందరలోనే అర డజన్ కి పైగా గవర్నర్ల పదవులు ఖాళీ అవుతున్నాయి. అందులో కచ్చితంగా టీడీపీకి ఒక పోస్టు ఇస్తారని అంటున్నారు.
ఇప్పటికే రాజు గారు :
ఇక తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఒక గవర్నర్ పోస్టుని బీజేపీ కేటాయించింది. విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్ గా నియమించారు. రెండవ పోస్టు తొందరలో రాబోతోంది అని అంటున్నారు. మరి ఈ పోస్టు ఎవరికి ఎవరికి చాన్స్ ఎక్కువగా ఉంది అంటే బాబు మదిలో కేఈ క్రిష్ణమూర్తి యనమల రామక్రిష్ణుడు మెదులుతున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరూ పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా వారికి గౌరవప్రదమైన గవర్నర్ పదవిని ఇవ్వడం ద్వారా న్యాయం చేసినట్లు అవుతుంది అని అంటున్నారు.
సీమలో గట్టి పట్టు :
కేఈ క్రిష్ణమూర్తికి రాయలసీమలో మంచి పట్టు ఉంది. ఆయన బీసీ నేతగా బలమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన తమ్ముడు కుమారుడు రాజకీయ వారసులుగా ఉన్నారు, అయితే కేఈకి తగిన గౌరవం ఇస్తేనే సీమలో ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీకి సానుకూలం అవుతుందని అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో బీసీ పార్టీగా టీడీపీకి అది క్రెడిట్ గా ఉంటుందని అంటున్నారు. మరో వైపు యనమల విషయం తీసుకున్నా ప్రముఖ బీసీ నేతగా ఉన్నారు. ఆయనకు ఈ పదవి ఇచ్చినా పార్టీకి మేలు జరుగుతుంది అని అంటున్నారు. యనమల అయితే రాజ్యసభ సీటు మీద ఆశ పడుతున్నారు అని అంటున్నారు. ఆయనకు రాజ్ భవన్ దారి చూపించాలన్నది టీడీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. మొత్తానికి సామాజిక న్యాయం చేయాలన్నది టీడీపీ సిద్ధాంతం. అంతే కాకుండా సమర్ధులకు తగిన పదవులు ఇవ్వాలని కూడా చూస్తోంది. ఈ నేపధ్యంలో యనమల అయినా కేఈ అయినా కచ్చితంగా గవర్నర్ పదవిలో ఎవరో ఒకరు కూర్చునే అవకాశం ఉంది అని అంటున్నారు.
