కూటమి 'గ్రాఫ్'పై కల్లోల కథనాలు.. ఇదో 'ఆనందం'.. !
ఏపీలో కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ తగ్గుతోందని.. ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని ఓ వర్గం మీడి యా ప్రచారం చేస్తోంది.
By: Garuda Media | 27 Oct 2025 9:01 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ తగ్గుతోందని.. ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని ఓ వర్గం మీడి యా ప్రచారం చేస్తోంది. అంతేకాదు.. చంద్రబాబు 4.0 ప్రభుత్వం కల్లోలంగా ఉందని కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే.. వాస్తవం ఏంటి? నిజంగానే గ్రాఫ్ పడిపోయిందా? అనేది ప్రశ్న. దీనిపై టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారు. మనకెందుకులే.. అంతా .. చంద్రబాబే చూసుకుంటారు.. అని అనుకుంటు న్నారు. దీంతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.
అసలు వాస్తవం ఏంటి?
1) ప్రభుత్వంపై వ్యతిరేకత ఎప్పుడు పెరుగుతుంది? ప్రజలను పట్టించుకోకపోతే.. సమస్యలపై స్పందిం చకపోతే.. పెరుగుతుంది. ఇది ప్రధాన కారణం. గతంలో వైసీపీ హయాంలో అచ్చంగా ఇదే జరిగింది. ప్రజలను జగన్ పట్టించుకోలేదన్నది వాస్తవం. కేవలం బటన్ నొక్కుడుకే ఆయన పరిమితం అయ్యారు. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కానీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు.. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందిస్తున్నారు. నేరుగా మంత్రులను పంపిస్తున్నారు. ఇటీవల జరిగిన కందుకూరు, కర్నూలు ఘటనలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటప్పుడు గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది?
2) సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా.. ప్రబుత్వంపై అంతో ఇంతో వ్యతిరేకత పెరుగుతుంది. కానీ,.. కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు మించే ఈ పథకాలు తీసుకుంటున్నారన్నది కూడా వాస్తవం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి అమలయ్యాయి. అమలవుతున్నాయి. అయినా.. గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది? అంటే.. కేవలం ప్రచారం మాత్రమే.
3) ప్రజా సమస్యలు వినేందుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం: ఇది కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే.. టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు.. ప్రతిసోమ వారం కలెక్టర్లే స్వయంగా ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తూ.. సమస్యలపై స్పందిస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు టైమ్ బౌండ్లో పనిచేస్తున్నారు. ఇక, వ్యతిరేకతకుఅవకాశం ఎక్కడుంది? అనేది కీలక ప్రశ్న.
ఇవీ.. అసలు కారణాలు..
1) చేస్తున్న పనులను చెప్పుకొనేందుకు టీడీపీ నేతలు.. మొహమాట పడడం.
2) సాధారణంగా జరిగే ప్రమాదాలను కూడా ఇంతింతలు చేసి చూపడం.
3) ఎమ్మెల్యేలు.. అసంతృప్తిగా ఉండడం.
4) ప్రజలకు-ఎమ్మెల్యేలు సమయం ఇవ్వకపోవడం.
5) క్షేత్రస్థాయిలో అవినీతి పెరుగుతుండడం.
వీటిని పరిష్కరిస్తే.. అసలు సమస్యలు ఉండవన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
