Begin typing your search above and press return to search.

టీడీపీ ఫ్యూచ‌ర్‌కు ఇప్పుడు వీళ్లే కీల‌కం...!

క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌లుగా ఉన్న నాయ‌కులు.. పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. క్షేత్ర‌స్థాయి లో ప్ర‌తి ఇంటికీ వెళ్తారు.

By:  Garuda Media   |   27 May 2026 5:00 AM IST
టీడీపీ ఫ్యూచ‌ర్‌కు ఇప్పుడు వీళ్లే కీల‌కం...!
X

క్ట‌స్ట‌ర్ ఇంచార్జ్‌... రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌ధాన పార్టీల‌కు ఎక్క‌డా లేని..ఎవ‌రూ విన‌ని ఈ మాట టీడీపీలో బ‌లంగా వినిపిస్తోంది. రాష్ట్రాన్ని..క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి..50 వేల మంది జ‌నాభా ఉన్న ప్రాంతానికి ఒక‌నాయ కుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ నాయ‌కుడికి మ‌రో 30 మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు ఉంటారు. ఈ క్ల‌స్ట‌ర్ ఇంచార్జులే ఇప్పుడు టీడీపీకి అత్యంత కీల‌కంగా మార‌నున్నారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు.

ఎందుకు?

క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌లు, క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్ల‌పై పార్టీ అధినాయ‌క‌త్వం భారీగానేఆశ‌లు పెట్టుకుంది. ఇది అంత ఈజీగా తీసుకున్న నిర్ణ‌యం కాదు. చాలా దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌య‌మ‌నే చెప్పాలి. ఎమ్మెల్యేల‌పై పార్టీకి ఆశ‌లు ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో రేపు వారిపై వ్య‌తిరేకత పెల్లుబికితే.. అది పార్టీపై ప్ర‌భావం చూపించే అవ‌కాశంఉంటుంది. అందుకే.. ప్ర‌స్తుతం క్ల‌స్ట‌ర్ ఇంచార్జులుగా ఉన్న‌వారికే ఎక్కువ‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. ఇప్ప‌టికే అప్ప‌గించారు కూడా.

ఏం చేస్తారు?

క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌లుగా ఉన్న నాయ‌కులు.. పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. క్షేత్ర‌స్థాయి లో ప్ర‌తి ఇంటికీ వెళ్తారు. పార్టీకి ప్ర‌చారం చేయ‌డంలో కీల‌క రోల్ పోషించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే.. వారు రెండు సార్లు ప్ర‌తి ఇంటినీ చుట్టిరావాల‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సంక్షేమం, అభివృద్ధి పెట్టుబడులపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌ల‌కు కీల‌క రోల్ ఉంటుంద‌ని చంద్ర‌బాబుచెబుతున్నారు.

ప‌ద‌వులు కూడా..

క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారికి పార్టీలోనేకాదు.. రేపు మ‌రోసారి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వారి వారి.. ప‌నితీరును అంచ‌నా వేసి.. ప‌ద‌వులు కూడా ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. త‌ద్వారా క్షేత్ర‌స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయ‌డంతోపాటు.. వారిలోనూ స్ఫూర్తి నింపేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయితే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లమైన మెజారిటీ స్థానాలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే.. క్ల‌స్ట‌ర్ ఇంచార్జ్‌ల‌కు ప్రాధాన్యం పెరిగింద‌న్న చ‌ర్చ సాగుతోంది.