ఈయనకు మంత్రి...ఆయనకు పార్టీ పదవి ?
టీడీపీ రానున్న కాలంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు.
By: Satya P | 1 Aug 2026 9:23 AM ISTటీడీపీ రానున్న కాలంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అందులో మంత్రివర్గ విస్తరణ అన్నది ప్రధానంగా ఉంటుంది అని చెబుతున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రా రాజకీయాల్లో చూస్తే టీడీపీ జోరు పెంచేసింది. అనేక పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకుని వస్తున్నామని చెబుతోంది. వాటిని ప్రారంభిస్తూ అలాగే శంకుస్థాపన చేస్తూ ప్రజలకు చేరువ అవుతోంది. మరో వైపు చూస్తే రాజకీయంగా కూడా ఉత్తరాంధ్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.
స్థానిక ఎన్నికల తర్వాత :
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో నిర్వహించాలని టీడీపీ చూస్తోంది. అది కూడా నూటికి నూరు శాతం ఫలితాలను సొంతం చేసుకోవాలని అనుకుంటోంది. మరో వైపు చూస్తే కూటమి పటిష్టంగా ఉంది, మూడు పార్టీలు కలసి ఉన్నాయి. విపక్ష వైసీపీ శిబిరంలో గ్రౌండ్ లెవెల్ లో అంతగా ఉత్సాహం లేదని అంటున్నారు. దాంతో స్థానిక ఎన్నికల ఫలితాలు తమకు బాగా అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. ఆ ఫలితాల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని టాక్ నడుస్తోంది. అదే సమయంలో చూస్తే కేంద్రం మంత్రి వర్గ విస్తరణ చేస్తుంది అని ప్రచారంలో ఉంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత బహుశా చేపట్టవచ్చు అని అంటున్నారు. అక్కడ ఏపీకి దక్కే పదవులు సామాజిక సమీకరణలు అన్నీ బేరీజు వేసుకుని మరీ ఏపీలో కూడా మంత్రి వర్గ విస్తరణ చేపడతారు అని అంటున్నారు.
పల్లాకు చాన్స్ :
ఇక ఉత్తరాంధ్రాలో చూసుకుంటే కీలక మార్పులు తప్పవని అంటున్నారు. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కుతుందనే అంటున్నారు. ఆయనకు కూడా మంత్రిగా చేయాలని ఉంది. ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆయన ఉత్సాహంగా ఉంటున్నా మృదు స్వభావి కావడంతో అనుకున్న విధంగా వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో ఆయనను మంత్రిగా తీసుకుని అదే విధంగా మరో సీనియర్ నేతకు ఉత్తరాంధ్ర నుంచే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారు అని వినిపిస్తోంది. ఆ సీనియర్ నేత మరెవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు అని అంటున్నారు.
ఆ సామాజిక వర్గం కోసం :
శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబం ఒకే సామాజిక వర్గానికి మంత్రి పదవులు కట్టబెట్టారు అన్న అసంతృప్తి అయితే మిగిలిన సామాజిక వర్గాలలో ఉంది అని అంటున్నారు. ప్రత్యేకించి కాళింగ సామాజిక వర్గంలో ఈ భావన బలంగా ఉంది. వారు కూడా జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అందువల్ల వారికి ఈసారి చోటు కల్పిస్తారు అని అంటున్నారు. కేంద్రంలో ఎటూ రామ్మోహన్ నాయుడు కంటిన్యూ అవుతారని అంటున్నారు. దాంతో రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి బదులుగా కాళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. అదే సమయంలో అచ్చెన్న సేవలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. ఆయన వైసీపీకి ధీటుగా బదులిస్తారు అని హాట్ కామెంట్స్ చేయడంలో దిట్ట అని అంటున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్రా రాజకీయాల్లో అనుకున్న మార్పులు టీడీపీ చేస్తుంది అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది చూడాల్సి ఉంది.
