విశాఖలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా ?
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని పట్టుదలగా ఉంది.
By: Satya P | 15 Sept 2026 9:42 AM ISTస్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని పట్టుదలగా ఉంది. దానికి దారి చూపించిన వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనకు పొత్తులలో భాగంగా దక్కిన 21 సీట్లకు గానూ మొత్తం గెలుచుకుని ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనం క్రియేట్ చేశారు. దాంతో ఇది కూటమి పార్టీలకు కూడా మోజు పెంచింది. ఇపుడు ఆ ముచ్చట తీర్చుకోవడానికి తగిన అవకాశం దక్కింది అని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మొత్తం సీట్లు అన్నీ కూటమి గెలుచుకోవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇపుడు అదే దిశగా అంతా ముందుకు సాగుతున్నారు.
కంచుకోటలలో సీన్ రిపీట్ :
ఇక ఏపీలో కొన్ని కంచుకోటల్లాంటి జిల్లాలు ఉన్నాయి. అక్కడ సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది సాధ్యమే అంటున్నారు. విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల కూటమి ప్రభంజనం ఉంటుందని చెబుతున్నారు. అలాగే గోదావరి జిల్లాలలో తమ పట్టుని గట్టిగా నిలుపుకోవడానికి కూటమి మిత్రులు చూస్తున్నారు. ఇదే వరసలో ఉత్తరాంధ్రాలో పాగా వేయాలని చూస్తున్నారు. శ్రీఎకకుళం విశాఖ జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. విజయనగరంలో తేడా పాడాలు లేకుండా చిన్న శ్రీను లాంటి వారిని ఇటు వైపు లాగేసి మరీ అక్కడ కూడా కూటమి జెండా పాతేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
చెక్కుచెదరని విశాఖ :
వైసీపీ 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినప్పుడు విశాఖ జిల్లా చెక్కుచెదరలేదని అంటున్నారు. విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీ గెలుచుకుంది. 2024 నాటికి మొత్తానికి మొత్తం ఉమ్మడి జిల్లా సొంతం అయింది. ఇపుడు అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జీవీఎంసీ మేయర్ దాకా మొత్తం అన్నీ కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యకం చేశారు. వైసీపీకి ఎక్కడా చాన్స్ ఇచ్చేదే ఉండదని ఆయన చాలా నమ్మకంగా చెప్పారు. వైసీపీ వారు పోటీలో ఉంటే వారికి ముందే సంతాపం అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కామెంట్స్ చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభిరాం అయితే విశాఖ ప్రజలు వైసీపీకి ఎపుడూ చోటివ్వలేదని అదే మళ్ళీ రిపీట్ అవుతుందని అంటున్నారు.
పట్టు బిగించిందిలా :
కూటమి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పట్టు బిగినంచింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగలేదు కానీ కో ఆర్డినేషన్ మీటింగ్స్ జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయిలలో జరిగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్యంగానే ముందుకు సాగాలి అన్న నినాదాన్ని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుని వెళ్తున్నారు. మరో వైపు చూస్తే వైసీపీలో ఆ తరహా కో ఆర్డినేషన్ కనిపించడం లేదని అంటున్నారు. నాయకులు అంతా మీడియాకే పరిమితం అవుతున్నారని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం ఆరాటమే కానీ పోటీకి ఉత్సాహం చూపించే పరిస్థితి ఏ మేరకు ఉంది అన్నది కూడా చర్చకు వస్తోంది.
సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ :
సహజంగానే స్థానిక ఎన్నికలు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని భావన ఉంది. దాంతో వైసీపీ నేతలు కూడా గట్టిగా బరిలోకి దిగడానికి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక అంగబలం అర్ధ బలమున్న కూటమికి కంచు కోటలలో విజయాలు సెంటిమెంట్ గా మారుతున్న నేపథ్యం ఉంది. దాంతోనే కూటమి నేతలు సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని ముందే ప్రకటిస్తున్నారు. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ మీద ఎన్నికల కంటే ముందే నైతిక విజయాన్ని సాధించేందుకు చూస్తున్నారు అని అంటున్నారు.
