టాటా దూకుడు ఆగట్లేదు.. వరుసగా పదోసారి దేశంలోనే నంబర్-1 బ్రాండ్..
మార్కెట్లోకి రోజుకో కొత్త కంపెనీ వస్తూ ఉంటుంది.. "మేము విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం" అంటూ భారీగా ప్రచారాలు చేసుకుంటుంది. కానీ, చివరికి జనాలు నమ్మేది మాత్రం టాటానే.
By: A.N.Kumar | 15 July 2026 3:18 PM ISTఈ రోజుల్లో బ్రాండ్ అంటే ఏంటి బాసూ? నాలుగు యూట్యూబ్ యాడ్స్ వేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయిస్తే సరిపోతుందనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే బ్రాండ్ బిల్డింగ్‌లో "బాస్" ఎవరు అనేది టాటా గ్రూప్ మరోసారి నిరూపించింది. ఏదో ఒకసారి రెండుసార్లు కాదు.. ఏకంగా వరుసగా పదోసారి దేశంలోనే మోస్ట్ వాల్యూబుల్ బ్రాండ్‌గా నిలిచి రికార్డుల దుమ్ము దులిపేసింది.
ప్రముఖ బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం టాటా బ్రాండ్ విలువ అక్షరాలా రూ. 3.24 లక్షల కోట్లు (39 బిలియన్ డాలర్లు). ఈ నంబర్ చూస్తుంటేనే మిగతా కంపెనీలకు చెమటలు పడుతున్నాయి..
ఉప్పు నుండి ఐటీ దాకా.. అంతా టాటా మాయ
మార్కెట్లోకి రోజుకో కొత్త కంపెనీ వస్తూ ఉంటుంది.. "మేము విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం" అంటూ భారీగా ప్రచారాలు చేసుకుంటుంది. కానీ, చివరికి జనాలు నమ్మేది మాత్రం టాటానే.
ఉదయం లేచిన దగ్గర నుండి.. వంటలో వేసే ఉప్పు దగ్గర నుంచి.. ఆఫీసులో వాడే ఐటీ సర్వీసెస్ టీసీఎస్ దాకా.. రోడ్డు మీద వెళ్లే కార్ల నుంచి.. ఎక్కే విమానం, తాగే టీ.. చివరికి మన ఒంటి మీద వేసుకునే బట్టల షోరూంలు ట్రెంట్, జూడియో వరకు అంతా టాటా మయం. "మా దగ్గర లేనిదంటూ ఏదీ లేదు.. మేము లేని ఇల్లు దేశంలోనే లేదు" అన్నట్టుగా ప్రతి రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రత్యర్థులు ఎంతగా తలకిందులు తపస్సు చేసినా ఈ "ట్రస్ట్" అనే ఫార్ములాను మాత్రం కాపీ కొట్టలేకపోతున్నారు.
టాప్-5లో ఎవరెవరున్నారంటే..
ఈ జాబితా చూస్తే టాటా రేంజ్ ఏంటో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. టాటా తర్వాత కూడా భారత కార్పొరేట్ దిగ్గజాలే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
1వ స్థానం: టాటా గ్రూప్ – రూ. 3.24 లక్షల కోట్లు
2వ స్థానం: ఇన్ఫోసిస్ – రూ. 1.58 లక్షల కోట్లు
3వ స్థానం: ఎల్‌ఐసీ – రూ. 1.47 లక్షల కోట్లు
4వ స్థానం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
5వ స్థానం: రిలయన్స్ ఇండస్ట్రీస్
మిగతా సంస్థలు రన్నరప్ ట్రోఫీ కోసం కొట్టుకుంటుంటే.. టాటా మాత్రం సింపుల్‌గా ఫస్ట్ ప్లేస్ సీట్లో టవల్ వేసి కూర్చుంది. ఆ వాల్యూ డిఫరెన్స్ చూస్తేనే అర్ధమవుతుంది కదా, అసలైన "బాస్" ఎవరో.. ఈ జాబితాను పరిశీలిస్తే ఐటీ, బ్యాంకింగ్, బీమా, పారిశ్రామిక రంగాలే భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయని స్పష్టమవుతోంది.
గ్లోబల్ మార్కెట్‌కు గట్టి షాక్
ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి, ఐటీ ఇండస్ట్రీలో లే-ఆఫ్‌ల భయం పట్టుకుంది. కానీ మన ఇండియన్ బ్రాండ్ల జోరు చూస్తే మాత్రం వీటికి ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నాయి. దేశంలోని టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువ ఎంతో తెలుసా? సుమారు రూ. 24.34 లక్షల కోట్లు! గ్లోబల్ మార్కెట్లకు ఏమైనా కావచ్చు.. కానీ ఇండియన్ కస్టమర్ల జేబులు, మన కంపెనీల బ్రాండ్ వాల్యూలు మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి.
‘టాటా’ అంటే కంపెనీ కాదు బాస్.. ఒక ఎమోషన్!
మన దేశంలో ఏదైనా కొత్త కంపెనీ రాగానే "మేము దేశాన్ని మార్చేస్తాం" అని ఓవరాక్షన్ చేయడం కామన్. కానీ, ఆర్బాటాలు లేకుండా సైలెంట్‌గా దేశాన్ని శాసిస్తూ.. పదేళ్లుగా నంబర్-1 స్థానాన్ని తన సొంత జాగీరులా మార్చేసుకుంది టాటా. సో ఇకనైనా ఒప్పుకోండి.. టాటా అంటే కంపెనీ అనుకుంటివా.. ఇట్ ఈజ్ ఎ ‘బ్రాండ్’!
