Begin typing your search above and press return to search.

మనసు విజయ్ తో...పార్టీ స్టాలిన్ తో

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో మిత్ర పక్షంగా పక్క వాయిద్యంగా మారి దశాబ్దాలు అవుతోంది.

By:  Satya P   |   14 Feb 2026 5:00 AM IST
మనసు విజయ్ తో...పార్టీ స్టాలిన్ తో
X

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో మిత్ర పక్షంగా పక్క వాయిద్యంగా మారి దశాబ్దాలు అవుతోంది. ఎపుడో అరవై దశకం మధ్య దాకా కాంగ్రెస్ తమిళనాడుని ఏలింది. 1968 నుంచి సీన్ మారింది. తొలిసారి డీఎంకే అధికారంలోకి వచ్చింది ఆ తరువాత డీఎంకే అన్నా డీఎంకేల మధ్యనే పోరు సాగుతూ వస్తోంది. అధికారం ఆ రెండు పార్టీల మధ్యనే పరిమితం అవుతోంది. ఇక కాంగ్రెస్ కూడా తడవకు ఒక పార్టీతో జట్టు కడుతూ తన ఉనినికి చాటుకుంటూ వస్తోంది.

జాతీయ స్థాయిలోనే :

ఆ విధంగా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన రాజకీయానికి ఎంపీ సీట్ల కోసం తమిళనాడులో రాజీ పడుతూ వస్తోంది. అయితే జాతీయ పార్టీగా సెక్యులర్ భావాలు కలిగిన పార్టీగా కాంగ్రెస్ ఆరు దశాబ్దాల నుంది తమిళనాడులో ఎదిగే ప్రయత్నం చేయలేదు. దానితో పాటు ద్రవిడ పార్టీలు కాంగ్రెస్ ని కొన్ని సీట్లకే పరిమితం చేశాయి అనడం కూడా సబబు. కొన్ని అసెంబ్లీ సీట్లను ఇస్తూ కొన్ని ఎంపీ సీట్లను ఇస్తూ తమ హవానే డీఎంకే కానీ అన్నా డీఎంకే కానీ చాటుకుంటూ వస్తున్నాయి. ఈ అసంతృప్తి అయితే కాంగ్రెస్ లో బాగానే ఉంది.

విజయ్ తో కలిస్తే మేలు :

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి కొత్తగా దారి కనిపిస్తోంది అని అంటున్నారు. పాపులర్ సినీ స్టార్ గా ఉంటూ పార్టీని స్థాపించిన విజయ్ కి జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది. అది సభలలో తెలుస్తోంది. అంతే కాదు యూత్ అంతా ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీతో కలిస్తే ఆయన ఇమేజ్ తమ అనుభవం రెండూ కలసి సునామీ క్రియేట్ చేయవచ్చు అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలలో కూడా ఇదే అభిప్రాయం ఉంది అని అంటున్నారు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లను కోరవచ్చు అని పవర్ షేరింగ్ కి కూడా ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు.

స్టాలిన్ కీలక వ్యాఖ్యలు :

ఇక తాజాగా డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ తోనే తాము పోటీ చేస్తామని అన్నారు. అయినా సరే ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు ఆ శక్తి ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ తనకు మంచి మిత్రుడు అని స్టాలిన్ అంటూనే కాంగ్రెస్ పొత్తుల విషయంలో నర్మగర్భమైన వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ లేకపోయినా గెలుస్తామని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యమా అన్న చర్చ సాగుతోంది. అయితే విజయ్ పార్టీ వైపు కాంగ్రెస్ చూస్తోంది అన్న ప్రచారం నేపధ్యంలోనే స్టాలిన్ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వచ్చాయని అంటున్నారు.

ఒంటరిగా పోరు అంటూ :

ఇక విజయ్ తన టీవీకే పార్టీ ప్రచారంలో ఒంటరిగానే పోటీకి దిగుతామని తాము కింగ్ అవుతామని నమ్మకంగా చెబుతున్నారు. రాజకీయాలకే కాదు దోపిడికి తాము కొత్త అని డీఎంకే అవినీతి పాలన అని విమర్శలు సంధిస్తున్నారు. అందరినీ కలుపుకుని పోతామని చెబుతున్నారు ఇక విజయ్ పార్టీ నేతలు అయితే కాంగ్రెస్ తో పొత్తుకు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కాకపోయినా సోలోగా దిగాలని ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల సమయం ఉంది. దీంతో తమిళనాట రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అని అంటున్నారు. కాంగ్రెస్ టీవీకే తో చేతులు కలిపితే మాత్రం రాజకీయం మొత్తం మారుతుందని అంటున్నారు. రాహుల్ విజయ్ కలసి పాల్గొనే సభలతో తమిళనానాట భారీ మార్పు వస్తుందని అంటున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో స్టాలిన్ వంటి బిగ్ ఫిగర్ ఉండాలని ఆలోచన కూడా ఉందిట. సో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.