విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్!..
తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచారు.
By: Madhu Reddy | 23 May 2026 11:00 PM ISTతమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచారు. అయితే ఈ సారి ఆయన వార్తల్లో నిలవడానికి రాజకీయాలు లేదా సినిమాలు కారణం కాదు.. టీమిండియా రన్ మెషీన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి అందిన ఒక సూపర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని మీకు తెలుసా? అవును కోహ్లీ స్వయంగా సంతకం చేసిన ఒక స్పెషల్ క్రికెట్ బ్యాట్‌ను పట్టుకుని సీఎం విజయ్ దిగిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. క్రికెట్, సినిమా, రాజకీయ అభిమానులను అలరిస్తున్న ఆ ముచ్చట గురించి చూద్దాం..
విజయ్‌ను కలిసిన ఎంఆర్‌ఎఫ్ బృందం:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' పార్టీ ఏకంగా 108 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మే 10న విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ క్రమంలో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ ప్రతినిధుల బృందం సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో భాగంగా ఎంఆర్‌ఎఫ్ ఛైర్మన్ అండ్ ఎండీ కేఎం మమ్మన్, వైస్ చైర్మన్ అరుణ్ మమ్మన్, ఎండీ రాహుల్ మమ్మన్‌లు విజయ్‌ను కలిసి రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలపై చర్చించారు.
విరాట్ కోహ్లీ సంతకం ఉన్న బ్యాట్ కానుక:
ఈ భేటీ ముగిసిన తర్వాత ఎంఆర్‌ఎఫ్ ప్రతినిధులు సీఎం విజయ్‌కు ఒక అరుదైన బహుమతిని ఇచ్చారు. అదేంటంటే.. ఎంఆర్‌ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అటోగ్రాఫ్ చేసిన ఒక స్పెషల్ క్రికెట్ బ్యాట్‌ను విజయ్‌కు కానుకగా అందజేశారు. ఇక విరాట్ కోహ్లీ సిగ్నేచర్ ఉన్న బ్యాట్‌ను చేతబూని ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ విజయ్ ఇచ్చిన ఫోజులు చూసి ఇరు రంగాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాల పేర్లు కనిపించడంతో ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
సీఎం విజయ్ రాయల్ లుక్ అదుర్స్:
ఈ వైరల్ ఫొటోలలో ముఖ్యమంత్రి విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన బ్లాక్ కోట్ సూట్‌తో పాటు వైట్ ఓపెన్ కాలర్ షర్ట్ ధరించి, తమిళ సంప్రదాయాన్ని సూచించేలా భుజంపై బంగారు అంచులతో కూడిన తెల్లటి పట్టు తువ్వాలు వేసుకున్నారు. ఈ సరికొత్త రాయల్ అండ్ ట్రెడిషనల్ లుక్‌లో దళపతి చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉంటూనే విజయ్ తన సినిమా కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రస్తుతం సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్న ఈ క్రేజీ పొలిటికల్ యాక్షన్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విజయ్‌కు ప్రముఖుల నుంచి ఎన్నో అరుదైన బహుమతులు అందుతున్నాయి. ఇటీవలే దర్శకుడు వెంకట్ ప్రభు ఒక స్పెషల్ నంబర్ ప్లేట్‌ను ఇవ్వగా, ఇప్పుడు క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ సంతకం ఉన్న బ్యాట్ రావడం విశేషం.
