Begin typing your search above and press return to search.

పాక్ ని చావు దెబ్బ తీసిన తాలిబన్లు

సరైన సమయం చూసి మరీ పాక్ కి భారీ షాక్ ఇచ్చారు తాలిబన్లు. ఆఫ్గనిస్తాన్ ని గత నాలుగున్నరేళ్ళుగా పాలిస్తున్న తాలిబన్లను తమ గుప్పెట పెట్టుకుని నచ్చని దేశాల మీద ప్రయోగిద్దామని చెప్పు చేతలలో ఉంచుకుందామని పాక్ పన్నిన వ్యూహం దానికే బెడిసికొట్టింది.

By:  Satya P   |   18 Dec 2025 9:11 AM IST
పాక్ ని చావు దెబ్బ తీసిన తాలిబన్లు
X

సరైన సమయం చూసి మరీ పాక్ కి భారీ షాక్ ఇచ్చారు తాలిబన్లు. ఆఫ్గనిస్తాన్ ని గత నాలుగున్నరేళ్ళుగా పాలిస్తున్న తాలిబన్లను తమ గుప్పెట పెట్టుకుని నచ్చని దేశాల మీద ప్రయోగిద్దామని చెప్పు చేతలలో ఉంచుకుందామని పాక్ పన్నిన వ్యూహం దానికే బెడిసికొట్టింది. ఇపుడు తాలిబన్ల మీదకు యుద్ధం చేయాలని చూస్తూ కుట్రలు కుయుక్తులకు పాల్పడుతున్న పాక్ కి గట్టి బుద్ధి చెప్పాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ క్రమంలో వారు తాము చేయాలనుకున్నది చేశారు.

గొంతు ఎండిన పాక్ :

దీంతో పాక్ కి ఒక్కసారిగా గొంతెండుతోంది. పాక్ ని ఒక ఎడారిలా మార్చేసేలా తాలిబన్ల నిర్ణయం ఉండడంతో పాక్ తెగ గింజుకుంటోంది. పాక్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో కునార్ నది ప్రవహిస్తూంటుంది. ఈ నది ఎక్కువగా ఆఫ్హన్ ప్రాంతంలోనే సాగుతుంది. ఇంతకాలం ఆ నది పాక్ గుండా వెళ్ళినా ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇపుడు మాత్రం పాక్ ఆట కట్టించాలని నిర్ణయించింది. అదే సమయంలో తమ దేశంలో నదీ జలాలను సక్రమంగా వాడుకుని వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలను తీర్చుకోవాలని చూస్తోంది.

అక్కడ నుంచి మొదలై :

ఇక కునార్ నది ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలో ఉన్న హిందూ కుష్ పర్వతాల నుంచి తన ప్రయాణాన్ని ప్రారభిస్తుంది. అది అలా అక్క్డ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆఘనిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. ఇలా , కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల గుండా ముందుకు సాగుతూ కునార్ నది కాబూల్ నదిలో కలుస్తుంది. అలా మరింతగా ముందుకు సాగితే పెచ్ నది నీటితో కూడా కలుస్తుంది. ఇక అక్కడ నుంచి ఈ నది తన దిశ పూర్తిగా మార్చుకుని తూర్పుగా తిరిగి పోతుంది. అలా తిరగడం వల్ల నే పాకిస్థాన్ లోకి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతుంది. అలా పాక్ లోని పంజాబ్ ప్రావిన్సుల్లోని అట్టాక్ నగరం సమీపంలో సింధు నదికి చేరుకోవడంతో దీని ప్రస్థానం ముగుస్తుంది. అయితే ఇపుడు ఈ నది పాక్ లోకి ప్రవేశించకుండా తాలిబన్లు అడ్డుకట్ట వేశారు దాంతో పాక్ ప్రాంతం అంతా ఇపుడు ఎడాదిగా మారుతుందని ఆందోళన అయితే ఉంది.

ఇప్పటికే భారత్ షాక్ :

భారత్ ఇప్పటికే పాక్ కి షాక్ తినిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు అన్నట్లుగా భారత్ తమ దేశం నుంచి పాక్ వైపు ప్రవహించే సింధూ జలాలను పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ తమకే వాడుకోవాలని నిర్ణయించింది. దంతో పాకిస్థాన్ లోని సగం ప్రాంతం అంతా విలవిలలాడుతోంది. ఇపుడు తాలిబన్లు కూడా ఇదే విధంగా పాక్ కి షాక్ ఇవ్వడంతో రెండు వైపుల నుంచి చుక్క నీరు దక్కక దాయాది పాక్ హాహాకారాలు ఎత్తుతోందని అని అంటున్నారు. ఇదిలా ఉంటే అఫ్గన్ కునార్ నదిపైన తలపడుతున్న ప్రాజెక్ట్‌లకు భారత్ ఇప్పటికే తన పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా పాక్ కి చెక్ పెట్టేస్తోంది.

వేగంగా అడుగులు :

ఇక ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్ట్‌కు తాలిబన్ ప్రభుత్వం అయితే తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అఫ్గన్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో కునార్ నది నుంచి నంగర్‌హార్‌లోని దారుంతా డ్యామ్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనకు ఆమోదం దక్కిందని చెబుతున్నారు. ఇక కునార్ నది మీద చేపట్టే భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే కనుక ఆఫ్ఘాన్ లోని నంగర్‌హార్‌ ప్రావిన్సుల్లో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుందని అంటున్నారు. అలాగే వ్యవసాయానికి భారీ మేలు జరుగుతుందని చెబుతున్నారు.