Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గం హాట్‌ హాట్... ఫైటింగ్ మ‌రో రేంజ్‌లో.. !

ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టుగా రాజ‌కీయాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ మ‌రింత భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

By:  Garuda Media   |   21 Aug 2026 6:00 PM IST
ఆ నియోజ‌క‌వ‌ర్గం హాట్‌ హాట్... ఫైటింగ్ మ‌రో రేంజ్‌లో.. !
X

రాష్ట్రంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ, జ‌న‌సేన అనేలా చాలా నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. కానీ, ఓ నియోజ‌క‌వర్గంలో మాత్రం 'అంత‌కుమించి' అన్న‌ట్టుగా ఇరు ప‌క్షాల మ‌ధ్య ముఖ్యంగా స్థానిక నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి. నానాటికీ ఈ రాజ‌కీయ వ్యూహాలు.. పెరుగుతూనే ఉన్నాయి. అదే...ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి మ‌ధ్య రాజ‌కీయాలు నిరంత‌రం నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి.

ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టుగా రాజ‌కీయాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ మ‌రింత భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకుండా అడ్డుకుంటామని.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టేది కూడా లేద‌ని శ‌ప‌థం చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త రెండున్న‌రేళ్లుగా రాష్ట్రంలో ర‌గులుతున్న ఏకైక నియోజ‌క‌వ ర్గం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

అభివృద్ధి క‌న్నా..

నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎక్క‌డైనా ఉంటుంది. తాడిప‌త్రిలో మాత్రం రాజ‌కీయాల‌కు ఇస్తున్న ప్రాధాన్యం వైసీపీ హ‌యాంలోను.. ప్ర‌స్తుత కూట‌మి హ‌యాంలోనూ అభివృద్ధిని మించి ఉంటోంద‌న్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. యువ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నా.. రాజ‌కీయంగా జేసే వేస్తున్న అడుగుల కార‌ణంగా.. అభివృద్ధిపై పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు. గ‌త వైసీపీ దెబ్బ‌తిన్న‌ది కూడా ఇక్క‌డే. ముందుగా అభివృద్ధిపై ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంటే.. అది అల్టిమేట్‌గా పార్టీల‌కు క‌లిసి వ‌స్తుంది.

నిరంత‌రం రాజ‌కీయ‌మే.. అన్న‌ట్టుగా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం మారిపోవ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగా ఎన్ని క‌ల‌కు ముందు రాజ‌కీయాలు ఉంటాయి. కానీ, వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య వ్య‌క్తిగ‌త అంశాలు ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతున్నాయి. దీనిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే అంశంపైనే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంది. అంత‌కు మించి.. వ్య‌క్తిగ‌త దూకుడును ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటారా.. లేదా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. జేసీ హ‌వా ఓ రేంజ్ లో సాగుతోంద‌న్న‌ది వాస్త‌వం.