తాడిపత్రి-అనంతపురం అర్బన్ తేడా కనిపించట్లేదా?!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు రాజకీయంగా వివాదాలకు కేంద్రంగా మా రాయి. నిజానికి ఒకప్పుడు ఈ జిల్లా నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు మంచి పేరుంది.
By: Garuda Media | 20 Jan 2026 8:00 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు రాజకీయంగా వివాదాలకు కేంద్రంగా మారాయి. నిజానికి ఒకప్పుడు ఈ జిల్లా నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు మంచి పేరుంది. ఎంపీ లకు కూడా అదే పేరుంది. కానీ, రాను రాను వివాదాలకు కేంద్రంగా.. వ్యక్తిగత పనులకు ప్రాధాన్యంగా ని యోజకవర్గాలు మారుతున్నాయి. ఇది.. నియోజకవర్గాలతో పాటు జిల్లాపైనా ప్రభావం చూపుతున్న పరిస్థితి ని పెంచుతోంది.
తాడిపత్రి: ఇక్కడ జేసీ వర్గం హవా అందరికి తెలిసిందే. అయితే.. గత 2019లో ప్రజలు మార్పు దిశగా అడుగులు వేశారు. వైసీపీకి అవకాశం ఇచ్చారు. చిత్రం ఏంటంటే.. జేసీ హవాను, దూకుడును మించినట్టు.. వైసీపీ అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి వ్యవహరించారు. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ది మాట ఎలా ఉన్నా.. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇక, ఇప్పుడు మరోసారి జేసీ అస్మిత్ రెడ్డి విజయం దక్కించుకున్నా.. ఆ తరహా రాజకీయాలే కొనసాగుతున్నాయి.
అనంతపురం అర్బన్: ఈ నియోజకవర్గం ఇప్పుడు భారీ చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి మంచి పేరుంది. వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా.. అభివృద్ధి కోసం పనిచేశారన్న పేరుంది. అయితే.. అంతర్గత కుమ్ములాటలతో ఆయన కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న మాజీ ప్రబుత్వ అధికారి వేంకశ్వర ప్రసాద్.. ఇప్పుడు మరింత వివాదానికి కేంద్రంగా మారారు.
తాడిపత్రికి-అనంతపురం అర్బన్‌కు మధ్య తేడా లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారన్న టాక్ పార్టీలో ను.. ప్రజల్లోనూ వినిపిస్తోంది. ఇది వ్యక్తిగతంగా ఆయనకు ఏమాత్రం సహకరిస్తుందన్నది వచ్చే ఎన్నికల నాటికి తేలుతుంది. ఇదేసమయంలో వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు దూరమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. వివాదాలకు కేంద్రంగా.. నోటి దురుసు నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయిన.. ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే.. బాగుండేదన్న వాదన ఉంది. కానీ, అలా చేయకపోవడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఒక తరహా రాజకీయాలు సాగుతున్నాయని అంటున్నారు.
