నిస్వార్థ ధైర్యానికి చిరునామా.. ఎవరీ అహ్మద్ అల్ అహ్మద్..!
ధైర్యం చాలా మందికి ఉంటుంది కానీ నిస్వార్థ ధైర్యం అతి తక్కువ మందికే ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అహ్మద్ అల్ అహ్మద్ ఒకరు.
By: Raja Ch | 15 Dec 2025 6:00 PM ISTధైర్యం చాలా మందికి ఉంటుంది కానీ నిస్వార్థ ధైర్యం అతి తక్కువ మందికే ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అహ్మద్ అల్ అహ్మద్ ఒకరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యక్తి. ఈయనే సిడ్నీలోని బోండి బీచ్ లో ఊహించలేని భయానక సంఘటనల మధ్య అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. తన నిస్వార్థ ధైర్యాన్ని కనబరిచారు. ఆ అహ్మద్ అల్ అహ్మద్ సిరియాకు చెందినవారు!
అవును... డిసెంబర్ 14 - 2025, సిడ్నీలోని బోండి బీచ్ లో భయానక సంఘటనల మధ్య, అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన ప్రాణాలను పణంగా పెట్టి, క్షణాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడారు అహ్మద్ అల్ అహ్మద్. ఇది కేవలం ధైర్యమే కాదు.. ఇజ్రాయెల్ - సిరియా, ముస్లింలు - యూదులు మధ్య దశాబ్ధాలుగా సాగుతున్న వైరాన్ని ప్రశ్నించే విషయం.. మానవత్వాన్ని చూపించిన ఘటన.
తాజాగా ఆస్ట్రేలియాలో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న యూదులను చంపడానికి ప్రయత్నించిన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సుమారు డెబ్భై ఏళ్లకు పైగా మిడిల్ ఈస్ట్ లో ముస్లింలు, యూదులు.. సిరియా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. అవేవీ అహ్మద్ అల్ అహ్మద్ ను ఆపలేదు!
ఇక్కడ గమనించాల్సిన విషయం మరో విషయం ఏమిటంటే.. అహ్మద్ ను ధైర్యవంతుడైన ముస్లిం అని ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసించారు. అయితే ఇక్కడ అహ్మద్ లో చూడాల్సింది మతం కాదు.. మానవత్వం! ఎందుకంటే.. యూదులపై కాల్పులు జరుపుతున్న సమయంలో.. వారు ఏ తెగవారు, ఏ మతం వారు అనే సంకుచిత ఆలోచనలు అహ్మద్ ను ఆపలేదు!
అంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోతుంటే.. అతడు మాత్రం యూదులను రక్షించడానికి మృత్యువు వైపు పరుగెత్తాడు. తన తోటి మనుషుల ప్రాణాలను కాపాడాలని భావించాడు. ఇదే నిస్వార్ధ ధైర్యం.. మానవత్వాన్ని నిర్వచించే లక్షణం! ఆ లక్షణాలే ఇప్పుడు అహ్మద్ అల్ అహ్మద్ ను ప్రపంచ ముందు రియల్ హీరోని చేసి నిలబెట్టాయి! మతాలతో కొట్టుకునే వారి ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచాయి!
అహ్మద్ కు ట్రంప్ ప్రశంసలు..!:
సిడ్నీలో అహ్మద్ ప్రదర్శించిన సాహసాన్ని ఇజ్రాయెల్ ప్రధాని, ప్రపంచం మొత్తం అభినందిస్తోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యంగా ఉగ్రవాదులకు ఎదురు నిలిచారని.. ఆయన చేసిన గొప్ప పనికి తాను చాలా గర్వపడుతున్నానని తెలిపారు.
