Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్‌: సువేందుకు.. పెళ్ల‌యిందా.. లేదా?!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని తొలిసారి బీజేపీ ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఆ పార్టీ త‌ర‌ఫున సువేందు అధికారి సీఎం సీటును సొంతం చేసుకున్నారు.

By:  Garuda Media   |   9 May 2026 7:00 PM IST
హాట్ టాపిక్‌:  సువేందుకు.. పెళ్ల‌యిందా.. లేదా?!
X

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని తొలిసారి బీజేపీ ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఆ పార్టీ త‌ర‌ఫున సువేందు అధికారి సీఎం సీటును సొంతం చేసుకున్నారు. తాజాగా శ‌నివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సువేందు ఒక్క‌రే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప‌లువురు కేంద్ర మంత్రులు.. సీనియ‌ర్లు హాజ‌ర‌య్యారు.

ఇక‌, ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన సువేందు అధికారి గురించి.. ప్ర‌స్తుతం నెటిజ‌న్లు జోరుగా శోధిస్తున్నారు. ఆయ‌న జీవిత విశేషాల‌తోపాటు.. భార్య‌, పిల్ల‌లు వంటి అనేక విష‌యాల‌ను కూడా విచారిస్తు న్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న ఆస్తిపాస్తుల‌ను కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన పేరు సువేందు అధికారి కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సువేందు అధికారి వ‌య‌సు 55 సంవ‌త్స‌రాలు. ఆయ‌న వివాహం చేసుకోలేదు. ఆయ‌న సోద‌రుడు దివ్య‌క్‌ అధికారి ఎంపీగా ఉన్నారు. అయితే.. బెంగాల్ ప్ర‌జ‌ల‌కు అవివాహిత ముఖ్య‌మంత్రులు వ‌ర‌సుగా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు 15 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. అవివాహితురాలు కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సువేందుకు కూడా వివాహం కాలేదు.

ఇక‌, ఆస్తిపాస్తుల విష‌యానికి వ‌స్తే.. వీరి కుటుంబం ఆది నుంచి రాజ‌కీయాల్లోనే ఉంది. తాత‌, తండ్రి కూడా.. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నాయ‌కులు, కేంద్రంలో మంత్రులుగా కూడా ప‌నిచేశారు. దీంతో ఆస్తికి కొద‌వ‌లేదు. మ‌రోవైపు.. సువేందు విద్యార్హ‌త‌ల విష‌యానికి వ‌స్తే..ఆయ‌న ఎం.ఏ. వ‌ర‌కు చదువుకున్నారు. దీనికి మించి.. ఆయ‌న‌కు ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దాదాపు 30 ఏళ్లుగా ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు త‌ప్ప ఓట‌మి అనే మాటే లేదు. అంతేకాదు.. త‌న‌కు రాజ‌కీయంగా బాట‌లు ఏర్ప‌రిచిన మ‌మతా బెన‌ర్జీని సైతం ఆయ‌న గ‌త‌, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రెండు సార్లు ఓడించారు.