Begin typing your search above and press return to search.

కెనడా బీఫ్ వండిన వివాదంలో అరెస్ట్.. అసలు నిజం బయటపెట్టిన భారతీయ సంతతి మహిళ

అయితే ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సరీ భారతీయ సంతతి మహిళ స్పందించారు. ఒక వీడియోను విడుదల చేస్తూ తన వైపు ఉన్న వాదనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

By:  A.N.Kumar   |   14 Sept 2026 12:00 AM IST
కెనడా బీఫ్ వండిన వివాదంలో అరెస్ట్.. అసలు నిజం బయటపెట్టిన భారతీయ సంతతి మహిళ
X

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం సరీ నగరంలో ఇంటి యజమాని అయిన భారతీయ సంతతి మహిళకు, ఆమె ఇంట్లో అద్దెకు ఉండే లోకల్ కెనడా కిరాయిదారులకు మధ్య చెలరేగిన తీవ్ర వివాదం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇంటి ఓనర్ భారతీయ సంతతి మహిళ వేధింపులకు గురిచేస్తోందని అనుమతి లేకుండా రూమ్‌లోకి వచ్చి తలుపులు తీసేసిందని కిరాయిదారులు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సరీ భారతీయ సంతతి మహిళ స్పందించారు. ఒక వీడియోను విడుదల చేస్తూ తన వైపు ఉన్న వాదనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

అసలు ఆ రోజు ఏం జరిగింది? అరెస్ట్ వివాదంపై వివరణ

పోలీసులు తన ఇంటికి వచ్చి తమ వాహనం వద్దకు తీసుకెళ్లారన్న వార్త నిజమేనని భారతీయ సంతతి మహిళ అంగీకరించారు. అయితే సోషల్ మీడియా ప్రచారంలో ఉన్నట్లుగా తనను అరెస్ట్ చేయలేదని.. కేవలం కొద్దిసేపట్లోనే పోలీసులు తనను విడుదల చేశారని ఆమె స్పష్టం చేశారు. కిరాయిదారులకు సంబంధించి సరైన సమాచారం లేదా పూర్తి వివరాలు పోలీసుల వద్ద లేకపోవడం వల్లనే ఈ తప్పుడు వాతావరణం, అపార్థం చోటుచేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు.

కిరాయిదారుల వల్లే అసలు సమస్యలు.. మహిళా ఆరోపణలు

కిరాయిదారులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అసలు సమస్య అంతా వారి వల్లే మొదలైందని ఆమె ఆరోపించారు. ఇచ్చిన గడువు ప్రకారం వారు ప్రాపర్టీని ఖాళీ చేయడానికి నిరాకరించారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచకుండా సరిగ్గా నిర్వహించకపోవడంతో ఆస్తికి నష్టం వాటిల్లింది. ఈ విషయమై ప్రశ్నించడం వల్లే ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి వివాదానికి దారితీశాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, కస్టమర్లు , దాదాపు 300 మంది అభిమానులకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చట్టపరంగానే పోరాటం

గతంలో కిరాయిదారులు షేర్ చేసిన వీడియోలలో ల్యాండ్‌లేడీ తమను మానసికంగా వేధించిందని, తాళాలు మార్చేసిందని, ఇంటి తలుపును తొలగించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలలో ఎంతవరకు నిజముందనేది స్వతంత్రంగా ధృవీకరించబడలేదు.ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయవాదులు, పోలీసుల పర్యవేక్షణలో ఉందని భారతీయ మహిళ తెలిపారు. టెనెంట్ల వైఖరిపై తాను కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.

ఇరువర్గాలు సోషల్ మీడియా వేదికగా ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఈ సరీ వివాదం ఇప్పుడు రెండు కోణాలను సంతరించుకుంది. ఒకవైపు హక్కుల కాలరావేనని టెనెంట్ అంటుంటే మరోవైపు నిబంధనల ఉల్లంఘనే కారణమని ల్యాండ్‌లేడీ పేర్కొంటున్నారు. ఇరువైపుల వాదనలు కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్నందున.. స్థానిక పోలీసులు, కెనడియన్ న్యాయస్థానం వెలువరించే అధికారిక నివేదికల ద్వారా మాత్రమే ఈ ఘటనలోని పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.