"కరుణానిధి తర్వాత.. సీఎం రేవంతే": ఊహించని ప్రశంస!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని నాయకురాలి నుంచి ప్రశంసలు దక్కాయి.
By: Garuda Media | 6 Aug 2025 6:32 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని నాయకురాలి నుంచి ప్రశంసలు దక్కాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి.. రాష్ట్రపతికి పం పించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయలేదు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కారు వైఖరిని ఎండగడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు.. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు.. ఇండి కూటమిలో మిత్రపక్షాలుగా పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నాయకులు కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ.. కనిమొళి సహా.. మహారాష్ట్రకు చెం దిన ఎన్సీపీ పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే.. తదితరులు.. సీఎం రేవంత్ చెంతనే కూర్చుని కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసించారు. బీసీలకు మేలు చేయాలన్న తలంపుతోనే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిందని.. దీనికి కూడా కేంద్రం అడ్డు పడుతోందని నాయకు లు విమర్శించారు. ఇది సరికాదన్నారు.
ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. రేవంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డి పదవు ల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేశారని వ్యాఖ్యానించారు. ``ఒక కార్యకర్త.. ఏమీ లేని స్థాయి నుంచి ము ఖ్యమంత్రి పీఠం వరకు ఎదిగారు. ఇది అసాధారణం`` అని రేవంత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సమా జంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల తరఫున రేవంత్ రెడ్డి పోరాడారని తెలిపారు. ఇప్పుడు కూడా అదేస్ఫూర్తితో పేదలకు, బడుగులకు మేలు చేస్తున్నారని సుప్రియా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆమె.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని మించిపోతారని.. వ్యాఖ్యానించారు. గతంలో కరుణానిధి తమిళనాడులోని వెనుక బడిన వర్గాలకు 69 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నించారని.. దీనిని షెడ్యూల్ 9లో కూడా చేర్చారని అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో 42 శాతం బీసీలకు మేలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ ముందుకు సాగుతున్నాని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఊహించని ప్రశంసలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
