సుప్రీం ఎఫెక్ట్: కుక్కల కోసం 15 వేల కోట్ల ఖర్చు!
ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుతిమెత్తగా స్పందించింది.
By: Garuda Media | 12 Aug 2025 8:03 PM ISTదేశ రాజధాని ఢిల్లీ సహా.. భారత రాజధాని ప్రాంతంలో వీధి కుక్కలను నిలవరించాలని.. రెండు మాసాల్లో నే వాటిని నగరం నుంచి తరిమేయాలని సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలి సిందే. అయితే.. వాటిని చంపేయొద్దని.. వాటికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి.. రక్షణ, నివాసం కల్పిం చాలని ఆదేశించింది. రెండు మాసాల(8 వారాలు) తర్వాత.. ఒక్క కుక్క కనిపించినా.. ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని కూడా ఆదేశించింది. అంతేకాదు.. ఈ తీర్పును రివ్యూ చేయాలని కోరే ప్రయత్నం చేయొద్దని కూడా జంతు ప్రేమికులకు సూచించింది.
ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే.. కఠిన చర్యలు తప్పవని, భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పుపై పలువురు స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ.. కుక్కలు పెద్ద సమస్య కాదని, వాటికి రెబీస్ ఇంజక్షన్లు ఇస్తే సరిపో తుందన్నారు. దీనికి పెద్దగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. ```రోజు రోజుకు మనం సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లుగా ఉంది`` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ వాదన ఇదీ..
ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుతిమెత్తగా స్పందించింది. ప్రస్తుతం ఢి ల్లీలో 3 లక్షలకుపైగా వీధికుక్కలు ఉన్నాయని.. వీటికి షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. బోలెడు సొమ్ములు కావాల ని సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తుందని తెలిపారు. అయితే..కార్యాచరణపై మంత్రివర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
మేనకా గాంధీ రియాక్షన్
గాంధీల కుటుంబానికే చెందిన ఎంపీ, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీ సైతం సుప్రీంకోర్టు తీర్పుపై పెదవి విరిచారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు సరికాదన్నారు. ఢిల్లీలో 3 లక్షల కుపైగా కుక్కలు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని.. వీటిని షెల్టర్లలో ఉంచేందుకు ఎంత లేదన్నా.. 3 వేలకుపైగా షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని.. దీనికి భూమి, నిర్మాణాలు, వసతుల కల్పన, సంరక్షకుల ఏర్పాటు ఖర్చు వంటివి కలుపుకొంటే.. 15 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇంత సొమ్ము ఢిల్లీ ప్రభుత్వం వద్దలేదన్నారు.
