Begin typing your search above and press return to search.

వ్యాపారాల కోసం నిర‌స‌న‌లు ఆపేయాలా: సుప్రీంకోర్టు

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన 'తిరంగా ర్యాలీ' నిరసనల నేపథ్యంలో.. భద్రతా ఆంక్షల వల్ల స్థానిక వ్యాపారులకు భారీగా నష్టం వాటిల్లుతోంది.

By:  Garuda Media   |   17 Oct 2026 10:44 AM IST
వ్యాపారాల కోసం నిర‌స‌న‌లు ఆపేయాలా: సుప్రీంకోర్టు
X

నిర‌స‌న‌ల నేప‌థ్యంలో త‌మ వ్యాపారాలు నిలిచిపోతున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో త‌మ దుకాణాల ప్రాంతాల్లో నిర‌స న‌లు జ‌ర‌గ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ.. ఢిల్లీలోని కొన్ని వ‌ర్గాల వ్యాపారులు శుక్ర‌వారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుమారు 100 మందికి పైగా వ్యాపారులు వివిధ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. వీటిపై తాజాగా విచార ణ చేసిన సుప్రీంకోర్టు.. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌జాస్వామ్య దేశంలో నిర‌స‌న‌ల‌కు ప్రాధాన్యం ఉంద‌ని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(బీ) ప్ర‌కారం.. ప్ర‌తి ఒక్క‌రికీ భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌, త‌మ అబిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా తెలిపే హ‌క్కు ఉంటుంద‌ని పేర్కొంది. నిర‌సన‌లు కూడా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మేన‌ని తెలిపింది. అలాంట‌ప్పుడు ఒక ప్రాంతంలోనిర‌స‌న‌లు ఆపేయాల‌ని ఆదేశా లు ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. వ్యాపారాల కోసం నిర‌స‌న‌ల‌ను ఆపేయాల‌ని కోరుకోవ‌డం స‌రికాదంది. అయితే.. ప్ర‌జ‌ల కోణంలో చూసిన‌ప్పుడు వ్యాపారాలూ ముఖ్య‌మేన‌ని పేర్కొంది.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన 'తిరంగా ర్యాలీ' నిరసనల నేపథ్యంలో.. భద్రతా ఆంక్షల వల్ల స్థానిక వ్యాపారులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిని అడ్డుకోవాల‌ని.. త‌మ వ్యాపారాలు స‌జావుగా సాగేలా చూడాల‌ని కోరుతూ.. వ్యాపారులు వేసిన‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఒకవైపు శనగలు అమ్ముకునే చిరు వ్యాపారాల హక్కు, మరోవైపు నిరసన తెలిపే వారి హక్కు, ఇంకోవైపు శాంతిభద్రతల నిర్వహణ.. ఈ మూడింటి మధ్య సమతుల్యత అవసరమని జస్టిస్ జాయ్‌మాల్ బ్యాగ్చి అభిప్రాయపడ్డారు.

అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పండుగల సీజన్ కావడంతో, చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు తమ జీవనోపాధి కోసం దీనిపైనే ఆధారపడతారని, వారి ఇబ్బందులపై కోర్టుకు అవగాహన ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. అయితే.. కేవ‌లం నిర‌స‌న‌ల కార‌ణంగా న‌ష్టపోతున్నామ‌న్న వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేమ‌ని పేర్కొంది. నిర‌స‌న‌లు అవ‌స‌ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. కానీ.. ఈ పిటిష‌న్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తామ‌ని పేర్కొంటూ వాయిదా వేసింది.