Begin typing your search above and press return to search.

సూపర్ డూపర్ ఎల్ నినో....భూగోళం మంటెక్కించేలా !

భూగోళం మరో సూర్య బింబం కాబోతుందా. ఎరుపెక్కి కసిగా పచ్చదనాన్ని కబలించనుందా.

By:  Satya P   |   8 Oct 2026 10:00 PM IST
సూపర్ డూపర్ ఎల్ నినో....భూగోళం మంటెక్కించేలా !
X

భూగోళం మరో సూర్య బింబం కాబోతుందా. ఎరుపెక్కి కసిగా పచ్చదనాన్ని కబలించనుందా. అధిక వేడితో భూమితో చెలగాటమాడనుందా అంటే ఇవి సందేహాలు అయితే సమాధానం మాత్రం ఒక్కటే. అదే అవును అని. భూగోళం మొత్తం దాదాపుగా సూపర్ డూపర్ ఎల్ నినో ప్రభావానికి గురి కాబోతోంది అన్న తీవ్రమైన హెచ్చరికలను ప్రపంచ వాతావరణ సంస్థ జారీ చేయడాన్ని చూస్తే అసలు భూమి మీద ఏమి జరుగుతోంది అన్న కలవరం యావత్తు ప్రజానీకానికి వస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల ఎల్ నినో ప్రభావం కొనసాగుతోంది. దాని పరిణామాలను పర్యవసానాలను అంతా స్వయంగా అనుభవిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని వాతావరణ నిపుణులు అంటున్నారు. అసలైన ఎల్ నినో ముందు ఉందని అలెర్ట్ చేస్తున్నారు. బాప్ కా ఎల్ నినో అనాలో లేక సూపర్ డూపర్ ఎల్ నినోగా పేరు పెట్టాలో తరువాత సంగతి కానీ ప్రపంచానికి పెను ముప్పు అయితే పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు.

అంతటా ఎర్రబారుతూ :

కేవలం అమెరికా తప్పించి మొత్తం ప్రపంచం అంతా ఈ సూపర్ డూపర్ ఎల్ నినో ప్రభావానికి గురి అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో దక్షిణ అమెరికా, భారత్, ఇండోనేషియా దేశలకు అయితే ఈ సూపర్ డూపర్ ఎల్ నినో ముప్పు అత్యధికంగా ఉందని కూడా చెబుతున్నారు. దీని వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా మూడు నాలుగు డిగ్రీల సెల్సియల్ ఎక్కువగా నమోదు అవుతాయని అంటున్నారు. ఈ సూపర్ డూపర్ ఎల్ నినో ఏకంగా 2027 ఫిబ్రవరి దాకా కొనసాగుతుందని కూడా వివరిస్తున్నారు. ఈ విధంగా ఎల్ నినో గురించి వస్తున్న వార్తలు ఐతే యావత్తు ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయని చెప్పక తప్పదు.

ఏడున్నర దశాబ్దాల తరువాత :

ప్రస్తుతం సూపర్ ఎల్ నినో అని ఏదైతే అంటున్నారో అది 1950 తరువాత ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యే అత్యంత బలమైన ప్రతికూల వాతావరణంగా కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే పసిఫిక్ మహా సముద్రంలోని భారీ ఉష్ణోగ్రతలు మొత్తం ప్రపంచ వాతావరణ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం అక్టోబర్ నెల సాగుతోంది. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ వేస్తున్న అంచనాలు చూస్తూంటే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లలొ ఎల్ నినోకు కేంద్రంగా ఉన్న మధ్య తూర్పు ఉష్ణ మండల పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో అక్కడి సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా మూడు నుంచి ఏడు డిగ్రీల దాకా ఎక్కువగా ఉండే చాన్స్ ని అంచనా కట్టారు.

మొత్తం దుర్భిక్షం :

ఈ సూపర్ డూపర్ ఎల్ నినో ప్రభావం తో ప్రపంచం అంతా ఎరుపెక్కడమే కాదు అనేక చోట్ల అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అలాగే కరవు అయితే విలయ తాండవం చేస్తుంది, ఇక ప్రపంచంలో ప్రకృటి సమతూల్యతను ఇది పెద్ద ఎత్తున దెబ్బ తీస్తుందని అంటున్నారు. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురీ వరదల ముప్పు సంభవిస్తే మరో ప్రాంతంలో వర్షాభావంతో నీటి కోసం కటకటలాడే దుస్థితి ఉంటుందని అంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా వర్షాలలో అసమానతలు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన అంచనాలు రావడం ప్రపంచానికి పెను సవాల్ గానే అంతా చూస్తున్నారు. దాంతో రానున్న నాలుగైదు నెలలు యావత్తు భూగోళానికి నిజమైన అగ్ని పరీక్షగానే హెచ్చరిస్తున్నారు. ఈ సూపర్ డూపర్ ఎల్ నినో నుంచి బయటపడి ఎర్ర ప్రపంచం కాస్తా పచ్చదనాన్ని చల్లదనాన్ని సమకూర్చుకునే స్థితి ఎపుడు వస్తుంది ఎలా దీనిని ప్రపంచం ఎదుర్కొంటుంది అన్నదే పెద్ద చర్చగా ఉందిపుడు.