Begin typing your search above and press return to search.

మహా రాజకీయంలో ఆమె అత్యంత కీలకం

మహారాష్ట్రలో ఇపుడు ఆమె పాత్ర చాలా కీలకంగా మారనుంది అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు అయిన అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్.

By:  Satya P   |   30 Jan 2026 9:15 AM IST
మహా రాజకీయంలో ఆమె అత్యంత కీలకం
X

మహారాష్ట్రలో ఇపుడు ఆమె పాత్ర చాలా కీలకంగా మారనుంది అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు అయిన అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్. ఆమెకు రాజకీయాలు కొత్త కాదు, రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. అయితే ఆమె నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కీలకమైన బాధ్యతలు నిర్వహించడం అంటే మాత్రం కొత్తే. అయితే అజిత్ పవార్ వారసత్వాన్ని కొనసాగించాలంటే ఆమె ఇపుడు చాలా ముఖ్యం. అంతే కాదు ఆమె అవసరం అటు ఎన్డీయేకు ఉంది. అలాగే ఆమె వైఖరి మీదనే వృద్ధ మరాఠీ నేత శరద్ పవార్ ఎన్సీపీ రాజకీయం కూడా ఆధారపడి ఉంది అని అంటున్నారు.

భారీ ఆఫర్ తో రెడీ :

అయితే ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో ఆమెకు భారీ ఆఫర్ ని రెడీ చేసి ఉంచింది అని ప్రచారం సాగుతోంది. అదే డిప్యూటీ సీఎం పదవి. అజిత్ పవార్ నిన్నటి వరకూ అధిష్టించిన ఈ రాజ పీఠం నేరుగా ఆయన సతీమణికి ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. నిజానికి మహారాష్ట్రలో బీజేపీకి 140 దాకా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పోఇగా 56 సీట్లతో ఏక్ నాథ్ షిండే శివసేన బలం కూడా ఉంది. కానీ 41 మంది అజిత్ పవార్ ఎన్సీపీని తమతోనే ఉంచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలోనే సునేత్ర పవార్ కి కీలక బాధ్యతలు అప్పగించి అజిత్ పవార్ లేని లోటుని తీర్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఆమెతోనే పోటీ :

ఇక అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ సీటు నుంచి సునేత్ర పవార్ ని పోటీ చేయించాలని ఎన్డీయే కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. అదే విధంగా అజిత్ పవార్ ఎన్సీపీలో చీలికలు లేకుండా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి అంతా ఒక్కటిగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

సీనియర్ల మనోగతం :

ఇక దీని మీద ఎన్సీపీ నాయకుడు మంత్రి నరహరి జిర్వాల్ పీటీఐతో మాట్లాడుతూ, సునేత్ర పవార్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజులు కోరుకుంటున్నారని కీలక ప్రకటన చేశారు. అంతే కాదు సీనియర్ నేతలైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండు, సునీల్ తట్కరేలు సునేత్ర పవార్ ని పరామర్శించి భవిష్యత్ ప్రణాళికలపై ఆమెతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. బారామతి నియోజకవర్గం నుంచి సునేత్రను బరిలో ఉంచాలని ఆపై ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలన్న దాని మీద ఎన్సీపీ సీనియర్లు త్వరలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి ఆయనతో ఇదే విషయమై చర్చిస్తారని అంటున్నారు.

విలీనం ఉండకపోవచ్చు :

సునేత్ర పవార్ ని కనుక ఉప ముఖ్యమంత్రిగా చేస్తే పార్టీలో సీనియర్లు బాధ్యతలు పంచుకుంటే అజిత్ పవార్ ఎన్సీపీ బలంగానే ఉంటుంది. దాంతో శరద్ పవార్ ఎన్సీపీతో విలీనం అవుతుంది అన్న ప్రచారానికి చెక్ పెట్టినట్లు అవుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఈ విలీనం జరగాలి అంటే సునేత్ర పవార్ నుంచి సుముఖత వ్యక్తం కావాలి. ఆమెకు శరద్ పవార్ ఎన్సీపీలో ప్రాముఖ్యత ఏ మేరకు దక్కుతుందన్న చర్చ ఉండనే ఉంది. దాంతో బీజేపీ అటు అజిత్ పవార్ ఎన్సీపీ నేతలు అంతా కలసి ప్రభుత్వంలోనే కొనసాగుతారని అంటున్నారు.