Begin typing your search above and press return to search.

ఈ సంవత్సరంలో లాంగెస్ట్ డే. ‘విటమిన్-D డే’ అసలు కథ ఏంటంటే?

ఈ ఏడాదిలోనే అత్యంత వింతైన, ప్రత్యేకమైన రోజు మన ముందుకు రాబోతోంది. జూన్ 21 (ఆదివారం) ఈ సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ సేపు పగలు ఉండే రోజుగా రికార్డు సృష్టించనుంది.

By:  Madhu Reddy   |   19 Jun 2026 7:41 PM IST
ఈ సంవత్సరంలో లాంగెస్ట్ డే. ‘విటమిన్-D డే’ అసలు కథ ఏంటంటే?
X

ఈ ఏడాదిలోనే అత్యంత వింతైన, ప్రత్యేకమైన రోజు మన ముందుకు రాబోతోంది. జూన్ 21 (ఆదివారం) ఈ సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ సేపు పగలు ఉండే రోజుగా రికార్డు సృష్టించనుంది. దీనిని సైన్స్ భాషలో 'సమ్మర్ సొల్‌స్టిస్' అంటారు. అయితే ఈ రోజుకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. సూర్యకాంతి ప్రాధాన్యతను గుర్తిస్తూ ఈ రోజును 'విటమిన్-D డే ఆఫ్ ఇండియా'గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..

అసలు ఏంటి ఈ ‘సమ్మర్ సొల్‌స్టిస్’?:

ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో తన అక్షంపై 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇలా పరిభ్రమిస్తున్న సమయంలో జూన్ 21న భూమి యొక్క ఉత్తర అర్ధగోళం సూర్యుడికి అత్యంత దగ్గరగా వస్తుంది. ఇక లాటిన్ భాషలో ‘సొల్‌స్టిస్’ అంటే ‘సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు’ అని అర్థం. ఈ ప్రత్యేకమైన పొజిషన్ వల్లే ఆ రోజు మనకు పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది.

13 గంటలకు పైగా పగటి వెలుతురు:

సాధారణంగా రోజుకు 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుంది కదా! కానీ ఈ జూన్ 21న మాత్రం ఏకంగా 13 గంటల 10 నిమిషాల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అంటే ఆ రోజు రాత్రి చాలా చిన్నదిగా, పగలు చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఇక మన దేశంతో పాటు ఉత్తర అర్ధగోళంలో ఉన్న అన్ని దేశాల్లోనూ ఇదే ఖగోళ వింత కనిపిస్తుంది.

'విటమిన్-D డే'గా ఎందుకు ప్రకటించారు?:

ఈ పొడవైన రోజును కేవలం ఒక ఖగోళ వింతగానే కాకుండా, ప్రజల ఆరోగ్యం కోసం వాడుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భావించింది. మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-D సహజంగా సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఇళ్లకే పరిమితమై విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. అందుకే సూర్యకాంతి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్‌పై అందరికీ అవగాహన కల్పించడానికి ఈ రోజును 'విటమిన్-D డే'గా పిలవాలని IMA నిర్ణయించింది.

ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చే సూర్యకాంతిని సరిగ్గా వాడుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ జూన్ 21న వచ్చే ‘లాంగెస్ట్ డే’ మనకు ఈ విషయాన్నే గుర్తు చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సండే కాస్త ఎక్కువ సేపు ఎండలో గడుపుతూ, ప్రకృతి వింతను ఎంజాయ్ చేస్తూ మీ బాడీకి కావలసినంత విటమిన్ Dని ఫ్రీగా పొందేయండి.