Begin typing your search above and press return to search.

సుజనాకు పదవితో బ్యాలెన్స్ చేస్తారా ?

సుజనా చౌదరి కీలకమైన నేత. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ని పొలిటికల్ గా క్రియేట్ చేసుకున్నారు.

By:  Satya P   |   11 Feb 2026 9:30 AM IST
సుజనాకు పదవితో బ్యాలెన్స్ చేస్తారా ?
X

సుజనా చౌదరి కీలకమైన నేత. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ని పొలిటికల్ గా క్రియేట్ చేసుకున్నారు. టీడీపీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యారు. మొత్తం పన్నెండేళ్ళ పాటు పెద్దల సభలో ఉన్నారు. 2022 లో రెండోసారి పదవీకాలం పూర్తి అయ్యేనాటికి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీలో ఉన్నారు. బీజేపీ తనకు రెన్యూవల్ చేస్తుందని ఆయన ఆశించినా ఆ కోరిక నెరవేరలేదు, పోనీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఇస్తారని ఆశించినా అది కూడా జరగలేదు.

పార్లమెంట్ కోసమే :

దాంతో ఆయన 2024 ఎన్నికల వరకూ ఎదురుచూశారు. కూటమి పొత్తులతో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని తలచారు. కానీ కేశినేని నాని సీట్లోకి ఆయన తమ్ముడు చిన్ని ఎంట్రీ ఇచ్చి ఆ సీటు అందుకున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో చివరి నిముషంలో ఆయన విజయవాడ పశ్చిమ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయిష్టంగానే ఆయన బరిలోకి దిగారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఏపీలో మంత్రిగా పదవిని అందుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతోనే ఆయన పోటీకి ఒప్పుకున్నారు అని కూడా అనుకున్నారు. మొత్తానికి కూటమి పార్టీల మద్దతుతో మంచి మెజారిటీతో నెగ్గారు.

మినిస్టర్ గా చాన్స్ మిస్ :

అయితే అంతా అనుకున్నట్లుగా జరగలేదు, మినిస్టర్ పోస్ట్ అయితే సుజనా చౌదరికి దక్కలేదు, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినా అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తొలిసారి చట్ట సభలోకి ప్రవేశించిన సత్యకుమార్ యాదవ్ కి మినిస్టర్ బెర్త్ దక్కింది. ఇక శాసనసభా పక్ష నేత పదవి విష్ణు కుమార్ రాజుకి ఇచ్చారు. దాంతో సుజనా ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది.

పెరుగుతున్న ఆశలు :

ఈ క్రమంలో ఏపీలో మొత్తం 164 అసెంబ్లీ సీట్లలో కూటమి అభ్యర్ధుల పెర్ఫార్మెన్స్ మీద కూటమి పెద్దలు నివేదికలు తయారు చేశారు. వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు ఈ ర్యాంకులలో టాప్ వన్ ప్లేస్ లోకి సుజానా చౌదరి వచ్చారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని సాధిస్తూ ఎమ్మెల్యేగా తన సత్తాను చాటుకుంటున్నారు అన్నది ఈ ర్యాంకింగ్ తో స్పష్టం అయింది. ఆయన మీడియాకు దూరంగా ఉన్నా జనానికి దగ్గరగా మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి చేరువగా ఉంటూ గత ఇరవై నెలలలో ఎమ్మెల్యేగా మంచి మార్కులు కొట్టేశారు.

బెర్త్ ఖాయమంటూ :

ఈ పరిణామాల నేపథ్యంలో సుజనా చౌదరికి కేబినెట్ లో బెర్త్ ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జూన్ 12తో రెండళ్ళ పదవీ కాలం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. దాంతో కచ్చితంగా సుజనాకు బెర్త్ దక్కుతుందని చెబుతున్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రెండవ బెర్త్ ఇస్తారని అంటున్నారు. ఇక విజయవాడలో సామాజిక సమీకరణలు చూస్తే బీసీలకే పదవులు దక్కాయి. దాంతో ఈసారి కమ్మ సామాజిక వర్గం నుంచి సుజనాను తీసుకోవచ్చునని తద్వారా బాలెన్స్ చేయవచ్చు అని అంటున్నారు. అంతే కాకుండా టీడీపీతో పాటు బీజేపీకి రాజధాని ప్రాంతంలో మంత్రి పదవులు ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట.