హైదరాబాద్ లో షుగర్ డాడీలు అంత భారీగా?
అందరికి తెలియకున్నా.. ఇటీవల కాలంలో కొన్ని వర్గాల్లో షుగర్ డాడీ.. షుగర్ మమ్మీ.. షుగర్ బేబీల కాన్సెప్టులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
By: Garuda Media | 9 Feb 2026 10:01 AM ISTఅందరికి తెలియకున్నా.. ఇటీవల కాలంలో కొన్ని వర్గాల్లో షుగర్ డాడీ.. షుగర్ మమ్మీ.. షుగర్ బేబీల కాన్సెప్టులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకూ ఈ షుగర్ బంధాలేమన్న విషయాన్ని సింఫుల్ గా.. సూటిగా చెప్పేస్తే.. తమకున్న డబ్బు.. పలుకుబడి.. అధికారం.. అవకాశాల్ని చూపుతూ అనైతిక బంధాల్ని నడపటమే. ఈ షుగర్ బంధాలకు కేవలం డాడీలు (మగాళ్లు) మాత్రమే కాదు.. షుగర్ మమ్మీలు (మహిళలు) ఎక్కువ అవుతున్నారు. సింఫుల్ గా వీరిని ఒకే జెండర్ లో చెప్పాలంటే.. షుగర్ బేబీలుగా చెబుతున్నారు. వీరి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ అనైతిక బంధాల బురదలో చిక్కుకొని.. అనుబంధాల్నిపోగొట్టుకుంటునన వైనం పెరుగుతోంది.
కెరీర్ లో ఎదుగుదల కోసం కొందరు.. జల్సాల కోసం మరికొందరు.. డబ్బుల కోసం ఇంకొందరు.. తమ అవసరాల్ని తేలిగ్గా తీర్చుకోవటానికి.. ఇబ్బందుల్ని అధిగమించటానికి.. ఉద్యోగ అవకాశాల్ని మరింత పెంచుకోవటానికి ఈ దరిద్రపుగొట్టు ట్రెండ్ ను ఆశ్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరిలో ఒకరిది కోరిక అయితే.. మరొకరిది అవసరంగా చెప్పాలి. మన దేశంలో ఈ కాన్సెప్టు తక్కువే అయినా.. విదేశాల్లో చాలా ఎక్కువ. ఆ దరిద్రం ఇప్పుడు మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది.
ఈ షుగర్ కోటింగ్ బంధాలకు కంపెనీలు.. హాస్టళ్లు.. కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎంతగా ముదిరిపోయిందంటే.. డేటింగ్ సైట్లకు ధీటుగా ఈ షుగర్ సైట్లకు చందాదారులుగా భారీగా పెరుగుతున్నారు. హైదరాబాద్ లో పదకొండు వేల మంది షుగర్ డాడీలుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నట్లుగా ఒక సైట్ నిర్వాహకుడు పేర్కొనటం చూస్తే.. హైదరాబాద్ లో ఈ ట్రెండ్ ఎంత ఎక్కువ అవుతుందన్నది అర్థమవుతుంది. ఈ వ్యవహారాలకు ఇప్పటివరకు ముంబయిలోనే ఎక్కువ అన్నట్లు చెప్పేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతోంది.
కొవిడ్ విపత్తు.. ఈ తరహా రిలేషన్లను మరింత పెంచినట్లుగా చెబుతారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే.. మరెందరో ఉపాధి కోల్పోయారు. బంధాలు విచ్ఛన్నమయ్యాయి. ఇదే సమయంలో డేటింగ్ యాప్ లకు భారీగా చందాదారులు పెరగటం తెలిసిందే. కెరీర్ కోసం బయటకు వస్తున్న వారు.. కొత్త బంధాల బాటలో వెళుతున్నారు. దీని కారణంగా కొన్ని అనుబంధాలకు దూరమవుతున్న పరిస్థితి. ఈ బంధాలు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదంటున్నారు. ఎందుకంటే షుగర్ డాడీలు.. మమ్మీలు ఒక్కరితోనే ఉండరని.. అలాంటి వేళ.. ఈ బంధాన్ని సీరియస్ గా తీసుకున్నోళ్లు బిస్కెట్ కావటం ఖాయమంటున్నారు. అందుకే.. ఈ తరహా బంధాల విషయంలో బీకేర్ ఫుల్ గా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
