Begin typing your search above and press return to search.

సుగాలి ప్రీతీ కేసులో కూటమి సంచలన నిర్ణయం

ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన కేసుగా సుగాలి ప్రీతీ కేసుని చూడాల్సి ఉందని అంటున్నారు. సుగాలీ ప్రీతి తన హాస్టల్ గదిలో 2017లో విగత జీవిగా కనిపించారు.

By:  Satya P   |   3 Sept 2025 9:06 AM IST
సుగాలి ప్రీతీ కేసులో కూటమి సంచలన నిర్ణయం
X

ఏపీలో మరోసారి ప్రీతి సుగాలి కేసు రాజకీయ చర్చకు తావిచ్చింది. ఇటీవల కాలంలో ఈ కేసు విషయంలో కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ నడిచింది. తన కుమార్తె సుగాలీ ప్రీతి హత్య కేసు విషయం ఇన్నేళ్ళు అయినా ఏమీ తేలలేదని ఆమె తల్లి తాజాగా చేసిన విమర్శలతో మరోసారి ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. విశాఖలో జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పార్టీ వేదిక మీద నుంచి దీని మీద వివరణ ఇచ్చారు. అయితే దాని మీద కూడా విమర్శలు ప్రతి విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్ గానే తీసుకుంది.

అత్యంత వివాదాస్పద కేసుగా :

ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన కేసుగా సుగాలి ప్రీతీ కేసుని చూడాల్సి ఉందని అంటున్నారు. సుగాలీ ప్రీతి తన హాస్టల్ గదిలో 2017లో విగత జీవిగా కనిపించారు. ఆమెని ఎవరు చంపారు ఏమి చేశారు అన్నది నాటి నుంచి అతి పెద్ద చర్చగానే ఉంది. ఈ కేసు విషయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ జరిపినా ఎలాంటి పురోగతి లేదని అంటున్నారు. తగిన ఆధారాలు ఈ హత్య కేసుకు సంబంధించి లభించకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు.

పవన్ మీద విమర్శలతో :

ఇక సుగాలి ప్రీతి తల్లి విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ పవన్ మీద ఆరోపణలు చేశారు. ఆయన తన రాజకీయం కోసమే ఈ కేసుని ఉపయోగించుకున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు కూడా అదే చెబుతూ వచ్చారు.అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో పవన్ నిరసనలు తెలియచేయడం వల్లనే సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది అని గుర్తు చేశారు జనసేన నేతలు. అయితే ఆ సాయం వైసీపీ ప్రభుత్వం చేసింది అని దానిని ఏ విధంగా జనసేన క్లెయిం చేసుకుంటుందని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి ఈ నేపధ్యంలో నుంచి చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తోంది అని స్పష్టంగా అర్ధం అవుతోంది అందులో భాగమే సీబీఐ విచారణ అని అంటున్నారు.

రెండోసారి సీబీఐకి :

ఇక సీబీఐకి ఈ కేసుని రెండోసారి అప్పగిస్తున్నారు. గతంలో అయితే ఏ విధమైన పురోగతి లేదని తేలింది. మరి ఈసారి చూస్తే మరింత సీరియస్ గా దర్యాప్తు సాగుతుందా అన్నదే చర్చగా ఉంది. అయితే ఆధారాలు అన్నవి పెద్దగా లేవు అని చెబుతున్న క్రమంలో సీబీఐ కనుక రంగంలోకి దిగితే మాత్రం ఎంతో కొంత ఆశావహ వాతావరణం ఈసారి ఉండవచ్చు అని అంటున్నారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఎటూ కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఉంది. దాంతో ఈ కేసులో మూలాలను సీబీఐ పట్టుకుంటే ఆ కుటుంబానికి న్యాయం దక్కినట్లు అవుతుందని అంటున్నారు. ఇక ఈ కేసు విషయంలో దర్యాప్తును వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సీఐడీ చీఫ్‌లని కోరారని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.