Begin typing your search above and press return to search.

లవ్ సరిపోదు… రిలేషన్ నిలవాలంటే ఎఫర్ట్స్ కూడా అవసరం!

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా జరుగుతున్నాయో.. అంతే స్పీడ్‌గా విడాకుల వరకు వెళ్తున్నాయి.

By:  Madhu Reddy   |   2 July 2026 4:00 PM IST
లవ్ సరిపోదు… రిలేషన్ నిలవాలంటే ఎఫర్ట్స్ కూడా అవసరం!
X

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా జరుగుతున్నాయో.. అంతే స్పీడ్‌గా విడాకుల వరకు వెళ్తున్నాయి. చిన్నపాటి గొడవలు, మనస్పర్థలకే ఈ తరం జంటలు విడిపోవడానికి రెడీ అయిపోతున్నారు. అయితే కేవలం ప్రేమ ఉంటేనే వైవాహిక బంధం నిలబడదని, అందుకోసం ఇద్దరి వైపు నుండి 'వ్యక్తిగత అంకితభావం' మరియు కొన్ని ప్రత్యేక ఎఫర్ట్స్ చాలా అవసరమని ఫ్యామిలీ కౌన్సెలర్లు, నిపుణులు సూచిస్తున్నారు.

భాగస్వామికి సమయం ఇవ్వడం ముఖ్యం:

ఈ బిజీ లైఫ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోలేకపోతున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. రోజులో ఎంత బిజీగా ఉన్నా, కాసేపు కూర్చుని మాట్లాడుకోవడం, భాగస్వామి రోజంతా ఏం చేశారు, ఎలా ఉన్నారు అని అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఇలా క్వాలిటీ టైమ్ గడపడం వల్ల బంధంలో విసుగు, అసంతృప్తి రాకుండా ఉంటాయి.

పెద్ద నిర్ణయాలు కలిసే తీసుకోవాలి:

ఇల్లు కొనడం, కెరీర్ మార్చుకోవడం లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లాంటి ఏ పెద్ద నిర్ణయమైనా సరే.. ఒకరు మాత్రమే ఒంటరిగా తీసుకోకూడదు. ఇక ఇద్దరూ కలిసి కూర్చుని, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మీ మీద నమ్మకం, బంధంపై మరింత గౌరవం పెరుగుతాయి.

అవసరమైతే కొన్ని త్యాగాలు తప్పవు:

రిలేషన్‌షిప్ అన్నాక 'నేను, నా ఇష్టం' అనుకుంటే కుదరదు. బంధం బలంగా సాగాలంటే కొన్నిసార్లు మన వ్యక్తిగత లక్ష్యాలను లేదా ఈగోలను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇక ఒకరి సంతోషం కోసం మరొకరు చిన్న చిన్న త్యాగాలు చేయడానికి వెనకాడకూడదు. ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది.

లోపాలను అంగీకరించుకుంటూ జీవించాలి:

తప్పులు లేని వారు ఎవరూ ఉండరు. మొదట్లో అన్నీ పరఫెక్ట్‌గా అనిపించినా, కాలక్రమేణా ఒకరి లోపాలు మరొకరికి కనిపించడం కామన్. ఇక అలాంటప్పుడు వాటిని ఎత్తిచూపుతూ గొడవపడటం కంటే, వాటిని అర్థం చేసుకుని ఎలా సర్దుకుపోవాలో ఆలోచించాలి. ఎదుటివారిని మార్చాలని చూడకుండా, ఉన్నదున్నట్లుగా అంగీకరించినప్పుడే బంధం బలపడుతుంది.

బంధం అనేది ఒక మొక్క లాంటిది, దానికి ఇద్దరూ కలిసి నీళ్లు పోసి జాగ్రత్తగా కాపాడుకోవాలి. “లవ్ యూ” మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి… ఇద్దరూ కష్టపడితేనే పెళ్లి జీవితం సంతోషంగా సాగుతుంది. అందుకే ఇగోలను తగ్గించి, పార్ట్‌నర్‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లండి.