Begin typing your search above and press return to search.

వీధి కుక్కలు కనిపిస్తే తరలించాలని సంచలన ఆదేశం

దేశంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధి కుక్కల దాడిలో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.

By:  Satya P   |   8 Nov 2025 9:02 AM IST
వీధి కుక్కలు  కనిపిస్తే తరలించాలని  సంచలన ఆదేశం
X

దేశంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధి కుక్కల దాడిలో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అదే సమయంలో జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కల విషయంలో కరుణ చూపాలని అంటున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపధ్యంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయం మీద దాఖలైన పిటిషన్లను విచారించి తాజాగా తీర్పు వెలువరించింది.

తలగించాల్సిందే :

జనాలు ఎక్కువగా ఉండే ఆసుపత్రులు రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో వీధి కుక్కలను లేకుండా చూడాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఒకవేళ అక్కడ కనిపిస్తే కనుక వాటిని షెల్టర్ హోం లకు తరలించాలని ఆదేశించింది. అంతే కాదు పాఠశాలల వద్ద కూడా వీధి కుక్కలు ఉండకుండా చూసుకోవాలని కనిపిస్తే తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అందరూ అమలు చేయాలి :

విద్యా సంస్థలతో పాటు క్రీడా ప్రాంగణాలు ఇతర పబ్లిక్ ప్రదేశాలలో వీధి కుక్కలు కనిపిస్తే వాటిని అక్కడ నుంచి షెల్టర్లకు తరలించాలని కోరింది. అవసరం అయితే విద్యా సంస్థల వద్ద కంచెలు ఏర్పాటు చేసి వీధి కుక్కలు చొరబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. వీధి కుక్కలను పట్టుకోవడంతో సరిపోదని వాటిని షెల్టర్లకు తరలించడం కూడా బాధ్యతగా భావించాలని సూచించింది.

తనిఖీలు తప్పనిసరి :

వీధి కుక్కలు పబ్లిక్ ప్లేస్ లలో కానీ ప్రైవేట్ ప్లేస్ లో కానీ తిరగకుండా నిరోధించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని కోరింది.

జంతు ప్రేమికుల స్పందన :

ఇక ఆ మధ్యన సుప్రీం కోర్టు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాల మీద జంతు ప్రేమికులు అయితే ఆందోళన నిర్వహించారు. మూగ జీవులను రక్షించాలని కోరారు. చాలా మంది ప్రముఖులు సెలిబ్రిటీస్ కూడా ఈ విషయంలో తమదైన స్పందనను వ్యక్తం చేసారు. ఇపుడు సుప్రీంకోర్టు ఇపుడు దేశవ్యాప్తంగా వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తప్పించి రోడ్ల మీద తిరిగేలా చేయవద్దు అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన నేపధ్యంలో జంతు ప్రేమికులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.