Begin typing your search above and press return to search.

రోజులో షేరుకు రూ.వెయ్యి లాభం.. ఈ మేజిక్ ఈ కంపెనీలకే సాధ్యం!

ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రంగాల్లో ఒకటి షేర్ మార్కెట్. ఎప్పుడు ఎలా రియాక్టు అవుతుందో అర్థం కానట్లుగా మారింది.

By:  Garuda Media   |   15 May 2026 10:41 AM IST
రోజులో షేరుకు రూ.వెయ్యి లాభం.. ఈ మేజిక్ ఈ కంపెనీలకే సాధ్యం!
X

ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రంగాల్లో ఒకటి షేర్ మార్కెట్. ఎప్పుడు ఎలా రియాక్టు అవుతుందో అర్థం కానట్లుగా మారింది. కొన్ని షేర్ల విలువలు దారుణంగా పడిపోతుంటే.. మరికొన్నిషేర్ల ధరలు రాకెట్ లా దూసుకెళుతున్నాయి. కొన్ని పరిమితులను పెట్టుకొని చూసినప్పుడు కొన్ని కంపెనీల మేజిక్ మార్కెట్ మెరిసేలా చేయటమే కాదు.. ఆయా కంపెనీలకు ఇదెలా సాధ్యమైందన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కో షేరు మార్కెట్ విలువ రూ.10వేలకు దగ్గరగా ఉండి.. రోజులో దగ్గరదగ్గర రూ.వెయ్యి వరకు లాభం పొంది ఇన్వెస్టర్ల చూపు పడేలా చేయటమే కాదు.. వావ్ అనేలా చేసిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. అదెలా సాధ్యమైంది? ఇంతకూ ఆ షేర్లు ఏంటి? అలాంటి మేజిక్ నమోదు చేయటానికి కారణమేంటి? ఆయా సంస్థల ఉత్పత్తులు ఏంటి? వాటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న వివరాల్ని చూస్తే ఆసక్తికరంగా ఉందని చెప్పకతప్పదు.

సదరు సంస్థల షేర్ల వివరాలు ఇచ్చే ముందు ఒక హెచ్చరిక చేసి.. వివరాల్లోకి వెళితే సబబుగా ఉంటుంది. ఇప్పుడు చెబుతున్న షేర్ల వివరాలు.. వాటికి కారణాల్ని మార్కెట్ లో నమోదైన వివరాల ఆధారంగా చెబుతున్నదే తప్పించి.. సదరు షేర్లను కొనమని కానీ.. వాటితో ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదన్నది మర్చిపోకూడదు. ఆయా సంస్థల్లో మదుపు చేయటం ద్వారా జరిగే లాభనష్టాలతో మాకెలాంటి సంబంధం ఉండదన్నది మర్చిపోకూడదు. మార్కెట్ ను దగ్గర నుంచి గమనిస్తున్నప్పుడు.. ఆసక్తికరంగా అనిపించిన అంశాల్ని పాఠకులకు సదరు సమాచారాన్ని చేరవేయటమే తప్పించి.. మరెలాంటి ఉద్దేశాలు లేవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

వివరాల్లోకి వెళిపోతే.. డిక్సన్ టెక్నాలజీస్, పాలి క్యాబ్ ఇండియా సంస్థలు నిలుస్తాయి. ఈ షేర్లు ఒక్కరోజులో రూ.వెయ్యికు దగ్గరగా లాభాల్ని నమోదు చేశాయి. అదే సమయంలో బాలాజీ అమైన్స్ లిమిటెడ్, ఎన్ ఎల్ సీ ఇండియా లిమిటెడ్ షేర్ల గురించి చెప్పాలి. కాకుంటే.. ముందు ప్రస్తావించిన రెండు షేర్ల ధరలు ఒక్కొక్కటి రూ.10వేలకు దగ్గరగా ఉంటే.. రెండోసారి ప్రస్తావించిన (బాలాజీ అమైన్స్ , ఎన్ ఎల్ సీ ఇండియా) సంస్థల షేర్ల మార్కెట్ విలువ.. మొదట చెప్పిన రెండు సంస్థల షేర్ల ధరలతో పోలిస్తే చాలా తక్కువే అయినప్పటికి అప్పర్ సర్క్యూట్ లో ఒక రోజులో 20 శాతం.. 14.7 శాతం లాభాల్ని నమోదు చేసినవిగా చెప్పాలి.

ఇంతకూ ఈ నాలుగు సంస్థల నేపథ్యం.. వీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు ఏంటి? ప్రస్తుతం ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఈ షేర్ల మెరుపులకు కారణాలేంటి?అన్న వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తొలుత డిక్సన్ టెక్సాలజీస్ షేర్ వివరాల్లోకి వెళితే..దీని ఒక్కో షేరు బేస్ ప్రైస్ రూ.10వేలకు దగ్గరగా ఉండి రోజులో రూ.986.95గా పెరిగిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో కాంట్రాక్ట్ తయారీ సంస్థగా చెప్పొచ్చు. మార్కెట్ లో పేరున్న కంపెనీలకు మొబైల్ ఫోన్లు.. ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తులు మాత్రమే కాదు.. ఎల్ ఈడీ, డిస్ ప్లే ప్యానెల్స్ తయారు చేయటం.. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. సింగిల్.. డబుల్ డోర్ల ఫ్రిజ్ లు.. ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్.. బ్లూటూత స్పీకర్లు.. స్మార్ట్ వాచ్ లు.. ఇంటర్నెట్ సెట్ - టాప్ బాక్సులు.. మోడెమ్ లు.. వైఫై రూటర్లు.. సీసీ టీవీ కెమెరాలు.. డిజిటల్ వీడియో రికార్డర్లను ఉత్పత్తి చేస్తుంది.

ఇక.. పొలి క్యాబ్ ఇండియా విషయానికి వస్తే.. మన దేశంలో వైర్లు.. కేబుల్స్.. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ తయారీలో వీరికి మంచి పేరుంది. ఆధునిక విద్యుత్ ఆదా చేసే బీఎల్ డీసీ సీలింగ్ ఫ్యాన్లు.. టేబుల్ ఫ్యాన్లు.. పెడెస్టల్ ఫ్యాన్లు.. ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో పాటు ఎల్ ఈడీ బల్బులు.. ప్యానెల్ లైట్లు.. స్పాట్ లౌట్లు.. వాణిజ్య.. వీధి దీపాల లైటింగ్ వ్యవస్థలు, మాడ్యులర్ స్విచ్ లు.. ఎంసీబీలు..ఆర్ సీసీబీలు.. ఐసోలేటర్లు.. డిస్ట్రిబ్యూషన్ బోర్డులు.. స్టోరేజ్ వాటర్ హీటర్లు.. ఇండక్షన్ కుక్ టాప్స్.. ఐరన్ బాక్సులు.. సోలార్ ఇన్వెర్టర్లు.. సోలార్ ప్యానెళ్లు.. గ్రిడ్ టై ఇన్వర్టర్లు తదితర ఉత్పత్తులను వీరు అందిస్తారు.

రోజులో షేరుకు వెయ్యి రూపాయిల చొప్పున లాభాన్ని అందించకున్నా.. అప్పర్ సర్క్యూట్ 20 శాతం.. 15 శాతం మేర రోజులో లాభాల్ని నమోదు చేసిన సంస్థలుగా బాలాజీ అమైన్స్, ఎన్ఎల్‌సీ ఇండియాగా చెప్పాలి. బాలాజీ అమైన్స్ విషయానికి వస్తే మే 14న ఈ సంస్థ ఒక్కో షేరు ధర రూ.1623 ఉంది. రోజులో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి దాదాపు రూ.270కు పైనే లాభాల్ని సొంతం చేసుకుంది.

ఎన్ ఎల్ సీ ఇండియా విషయానికి వస్తే.. మే 14 నాటి ట్రేడింగ్ లో 14.77 శాతం లాభపడింది. దీని ఒక్కో షేరు ధర రూ.373గా ఉంది. రోజులో ఈ షేరు లాభం రూ.48 మేర పెరగటం అత్యధికంగా చెప్పాలి. ఈ రెండు సంస్థల వివరాల్లోకి వెళితే.. మొదట బాలాజీ అమైన్స్ లిమిటెడ్ విషయానికి వస్తే.. ఈ సంస్థకు తెలంగాణతో పాటు.. మహారాష్ట్రలోనూ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద స్పెషాలిటీ కెమికల్స్.. అలిఫాటిక్ అమైన్స తయారీ సంస్థగా చెప్పాలి. అదే సమయంలో ఎన్ ఎల్ సీ ఇండియా లిమిటెడ్ విషయానికి వస్తే.. ఇది కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పాలి. మైనింగ్ తో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థలు షేరు మార్కెట్ లో మెరిసేందుకు దారి తీసిన కారణాల్ని చూస్తే.. కంపెనీలు ప్రకటించిన క్యూ4 ఫలితాలు.. పెరిగిన సంస్థల ఆదాయాలు.. భారీగా పెరిగిన గ్లోబల్ ఆర్డర్లుగా చెప్పాలి. ఈ కారణాలతోనే మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ ఈ సంస్థల షేర్లు మిగిలిన షేర్లకు భిన్నంగా నిలిచాయని చెప్పొచ్చు.