Begin typing your search above and press return to search.

అమెరికాలో వలసలను 10 ఏళ్ల ఆపితే ఆ దేశానికి నష్టమా? లాభమా?

అలాంటి అమెరికా పదేళ్లపాటు వలసలను ఆపితే ఎవరికి నష్టం? అమెరికాకు నష్టమా? ప్రపంచంలోని మిగతా దేశాలకు నష్టమా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సర్వత్ర చర్చ జరుగుతుంది .

By:  A.N.Kumar   |   31 Dec 2025 1:00 AM IST
అమెరికాలో వలసలను 10 ఏళ్ల ఆపితే ఆ దేశానికి నష్టమా? లాభమా?
X

వాపును చూసి బలుపు అనుకుంటే అమెరికా దివాలా తీయడం ఖాయం. కేవలం అమెరికన్ల మీద మాత్రమే ఆ దేశం అభివృద్ధి చెందలేదు అన్నది వాస్తవం. అమెరికాలోని టాప్ కంపెనీల ను నడిపిస్తున్నది భారతీయులు చైనీయులు యూరప్ దేశస్థులు. ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడైన బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందినవాడు. అమెరికాకు వచ్చి ఆ అద్భుతాలు చేశాడు. అమెరికాలో అతడికి కావాల్సినంత స్వేచ్ఛ స్వాతంత్రం టెక్నాలజీ దొరకబట్టే ఈ అద్భుతాలు సాధించాడు. ప్రపంచ టెక్నాలజీలో దూసుకెళ్తున్న గూగుల్ ను కూడా ఒక భారతీయుడు నడిపిస్తున్నారు.. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ను మన సత్యనాదెళ్ల లీడ్ చేస్తున్నాడు. ఇంకా మరెన్నో కంపెనీలకు చైనీలు యూరప్ వాసులు నడిపిస్తూ అమెరికాను ఇప్పుడు అగ్ర పథాన నిలబెట్టారు. అలాంటి అమెరికా పదేళ్లపాటు వలసలను ఆపితే ఎవరికి నష్టం? అమెరికాకు నష్టమా? ప్రపంచంలోని మిగతా దేశాలకు నష్టమా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సర్వత్ర చర్చ జరుగుతుంది .

అమెరికాను మళ్ళీ శక్తివంతమైన దేశంగా మార్చాలంటే పదేళ్లపాటు వలసలను పూర్తిగా నిలిపేయాల్సిందే అని డోనాల్డ్ ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీల్ బానన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న వలసల వ్యవస్థను పదేళ్లపాటు స్తంభింప చేస్తే అసలు ఏం జరుగుతుంది? ఇది అమెరికాను రక్షిస్తుందా? లేక ఆ రొంపిలోకి నెడుతుందా? అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతుంది.

స్టీవ్ బానన్ తన వార్ రూమ్ షోలో చేసిన ప్రతిపాదన వెనక ప్రధానంగా జాతీయ వాదం కనిపిస్తోంది. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. విదేశీయుల రాక తగితే తక్కువ వేతనాలకు పనిచేసే వారి పోటీ తప్పుతుంది. దీనివల్ల అమెరికన్ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగి వారికి వేతనాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ వ్యవస్థ అవినీతిమయమైందని పదేళ్ల విరామం ఇస్తే వీసా కేటాయింపుల్లో ఉన్న లొసుగులను సరిదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా హెచ్ 1 బి వీసాల ద్వారా వచ్చే ఐటీ ఉద్యోగుల వల్ల స్థానిక గ్రాడ్యుయేట్లకు నష్టం జరుగుతోందనేది బానన్ మద్దతు దారుల ప్రధాన ఫిర్యాదు.

ఆందోళన కలిగిస్తున్న వాస్తవాలు.. అమెరికాకే ఎదురుదెబ్బ?

వలసలను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదంలో పడుతుంది. అమెరికాలోని వ్యవసాయం నిర్మాణం హెల్త్ కేర్ రంగాలు పూర్తిగా వలస కార్మికులపైనే ఆధారపడి ఉన్నాయి. వలసలు ఆపితే ఐటి ఏఐ సెమీ కండక్టర్ రంగాల్లో అమెరికా తన అగ్రస్థానాన్ని కోల్పోయి చైనా వంటి దేశాల కంటే కూడా వెనుకబడిపోవడం ఖాయం .అమెరికాలో ప్రస్తుతం వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. జనన రేటు తగ్గుతుంది. పనిచేసే యువశక్తి దేశంలోకి రాకపోతే సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ కుప్పకూలుతుంది. పన్నులు చెల్లించేవారు తగ్గి పెన్షన్ల భారం పెరుగుతుంది.

వలసలను పూర్తిగా నిలిపివేయడం అనేది అమెరికాకు తాత్కాలిక రాజకీయ లాభాన్ని ఇవ్వచ్చు.కానీ దీర్ఘకాలంలో ఆ దేశ ఉనికినే ప్రమాదంలో పడేస్తుంది. అమెరికాకు కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిషేధం కాదు కేవలం సంస్కరణలు కావాలి. అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవడం కావాలి. నైపుణ్యం కలిగిన వలసలను ప్రోత్సహించాలి. వీసా వ్యవస్థలోని అక్రమాలను తొలగించాలి.

అవకాశాల దేశంగా పేరుగాంచిన అమెరికా తన తలుపులు మూసుకుంటే ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు కెనడా, ఆస్ట్రేలియా లేదా యూరప్ వైపు మళ్లుతారు. అదే జరిగితే 21వ శతాబ్దంలో అమెరికా తన సూపర్ హోదాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.