Begin typing your search above and press return to search.

స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధర వాచిపోయింది.. 30 రోజుల ఫ్రీ ట్రయల్.. అన్ లిమిటెడ్ డేటా

ఇంటర్నెట్ సదుపాయం అందరికీ ఉండదు. కొన్ని మారుమూల గ్రామాలు, శివారు ప్రాంతాలకు, అడవులు, కొండలు, కోనల్లో సెల్ సిగ్నల్స్ సమస్య ఇప్పటికీ ఉంది.

By:  A.N.Kumar   |   8 Dec 2025 3:59 PM IST
స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధర వాచిపోయింది.. 30 రోజుల ఫ్రీ ట్రయల్.. అన్ లిమిటెడ్ డేటా
X

ఇంటర్నెట్ సదుపాయం అందరికీ ఉండదు. కొన్ని మారుమూల గ్రామాలు, శివారు ప్రాంతాలకు, అడవులు, కొండలు, కోనల్లో సెల్ సిగ్నల్స్ సమస్య ఇప్పటికీ ఉంది. దేశమంతా ఇంటర్నెట్ అందుబాటులో లేదు. పల్లెలకు ఇప్పటికీ సిగ్నల్స్ అందదు. ఇలాంటి సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ భారత్ లో తన ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. నెలవారీ ధరలను సబ్ స్క్రిప్షన్ ధరలను తాజాగా ప్రకటించారు. రెసిడెన్షియల్ కస్టమర్లకు ఓ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాన్ వివరాలు, ధరలు వెబ్ సైట్ లో పొందుపరిచింది.

స్టార్ లింక్ వెబ్ సైట్ ప్రకాం.. రెసిడెన్షియల్ కస్టమర్లు నెలకు రూ.8600 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా హార్డ్ వేర్ ధరను రూ.34వేలుగా నిర్ణయించింది. ఈ ప్లాన్ లో అపరిమిత డేటా లభిస్తుందని స్టార్ లింక్ తెలిపింది. 30 రోజుల ఫ్రీ ట్రయల్ ను అస్వాదించవచ్చు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తమ సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని స్టార్ లింక్ తెలిపింది. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంగా ఈ డివైజ్ ను రూపొందించామని.. ఎవరైనా సరే వ్యక్తులే సొంతంగా ఈ డిజైన్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఎంత స్పీడుతో సేవలు అందుతాయన్నది పేర్కొనలేదు.

ఇక బిజినెస్ సబ్ స్క్రిప్షన్ రేట్లను కూడా వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని వెబ్ సైట్ లో పేర్కొంది. అదే సమయంలో పొరుగుదేశాలపై బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్టు మ్యాప్ లో చూపిస్తోంది. దేశవ్యాప్త సేవలు తీసుకురావడంలో ఇప్పటికే నియామక ప్రక్రియను సైతం కంపెనీ ప్రారంభించింది.

ఇక హైదరాబాద్, చండీగఢ్, కోల్ కతా, లక్నో, ముంబై, నోయిడా వంటి నగరాల్లో గేట్ వే ఎర్త్ స్టేషన్లను స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేస్తోంది. ఇక ఛార్జీల పరంగా చూస్తే ఫైబర్, టెలికాం టవర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ స్టార్ లింక్ సేవల విస్తరణకు అవకాశం తక్కువ. ఇంటర్నెట్ సేవలు లేని కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు మాత్రమే స్టార్ లింక్ సేవలు పరిమితం కానున్నాయి. అక్కడ వర్క్ ఫ్రం హోం, ఇంట్లో నుంచి ఆన్ లైన్ క్లాసులు, వీడియో కాలింగ్ కోసం ఈ సర్వీసులను పొందవచ్చు.

స్టార్ లింక్ ఈ ఉపగ్రహ ద్వారా ఇంటర్నెట్ సర్వీసులన్నింటిని అందిస్తుంది. నెట్ వర్క్ తక్కువగా లేదా లేని ప్రాంతాల్లోని రైతులు, అటవీ నివాసులు, వ్యవసాయ ప్రాంతాలకు స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ను సులభంగా అందించవచ్చు. భారీ ధర కారణంగా ఇండియాలో అత్యవసరం అయితే తప్ప దీన్ని తీసుకునే సాహసం చేయకపోవచ్చు.