స్టార్ బక్స్ మెగా ప్లాన్.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం!
భారతదేశంలోని టెక్ నిరుద్యోగులకు మరియు ఐటీ ఉద్యోగులకు గ్లోబల్ కాఫీ దిగ్గజం 'స్టార్‌బక్స్' ఒక అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.
By: Madhu Reddy | 14 Jun 2026 4:00 AM ISTభారతదేశంలోని టెక్ నిరుద్యోగులకు మరియు ఐటీ ఉద్యోగులకు గ్లోబల్ కాఫీ దిగ్గజం 'స్టార్‌బక్స్' ఒక అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మనదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భారీ కార్పొరేట్ టెక్నాలజీ ఆఫీస్‌ను ప్రారంభించేందుకు స్టార్‌బక్స్ మెగా ప్లాన్ సిద్ధం చేసింది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఖర్చులను తగ్గించుకుంటూ, సాంకేతిక రంగంలో సరికొత్త ఉద్యోగాల సృష్టికి ఈ సంస్థ శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే రోజుల్లో భారీగా నియామకాలు చేపట్టనుండటంతో టెక్ ప్రియుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం.
ఐటీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్:
స్టార్‌బక్స్ సంస్థ కేవలం కాఫీ షాపులకే పరిమితం కాకుండా, తన టెక్నాలజీ విభాగ బలాన్ని పెంచుకోవడానికి భారత్‌ను ఎంచుకుంది. వచ్చే ఏడాది 2027 లో రానుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఈ ఆఫీస్ పనులు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల మనదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వంటి విభాగాల్లో వందలాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ మెగా ప్లాన్:
ఇప్పటివరకు స్టార్‌బక్స్ కంపెనీ తన అవసరాల కోసం బయటి ఐటీ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడేది. ఇక దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అక్కడి వారి వాదన. ఇక బయటి వారికి అదనంగా డబ్బులు చెల్లించే కంటే, సొంతంగా టీమ్స్ ఏర్పాటు చేసుకుంటే ఖర్చులు తగ్గి, పనిలో నాణ్యత పెరుగుతుందని స్టార్‌బక్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
టాలెంట్ హబ్‌గా నిలిచిన ఇండియా:
గ్లోబల్ టెక్ ఆఫీస్ కోసం స్టార్‌బక్స్ సంస్థ వేరే దేశాల వైపు చూడకుండా ఇండియానే ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. మనదేశంలో సాఫ్ట్‌వేర్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న యువత ఎంతోమంది ఉన్నారు. పైగా ఇప్పటికే స్టార్‌బక్స్ ఇండియాలోని పలు టెక్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. అందుకే ఇక్కడి టాలెంట్‌ను నేరుగా వాడుకోవాలని కంపెనీ ఫిక్స్ అయింది.
లొకేషన్ ఎక్కడ? త్వరలోనే క్లారిటీ:
స్టార్‌బక్స్ తన సరికొత్త కార్పొరేట్ టెక్ ఆఫీస్‌ను ఏ నగరంలో పెట్టబోతోందనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది చివర్లోగా లొకేషన్‌ను ఫైనల్ చేసి, ఆ వెంటనే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ లేదా ముంబై లాంటి ఐటీ హబ్‌లలోనే ఈ ఆఫీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాల టాక్.
ప్రపంచంలోనే టాప్ బ్రాండ్ అయిన స్టార్‌బక్స్ నేరుగా భారత్‌లోకి వచ్చి టెక్ ఆఫీస్ పెట్టడం అనేది మన నిరుద్యోగ యువతకు ఎంతో ప్లస్ అవుతుంది. ఈ ఆఫీస్ ద్వారా వచ్చే సరికొత్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎంతోమంది ఐటీ నిపుణుల కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లొకేషన్ కన్ఫర్మ్ కాగానే మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
