'శ్రీకాళహస్తి' ఇష్యూ.. పార్టీలకు పొలిటికల్ జంఝాటం.. !
చైన్నై పోలీసు కమిషనర్.. రాయుడి హత్యపై స్పందించక ముందే.. బొజ్జల స్పందించారన్నది ప్రధాని ఆరోపణ.
By: Garuda Media | 5 Jan 2026 11:05 PM ISTశ్రీకాళహస్తిలో జరిగిన రాయుడు హత్య ఘటన.. మరోసారి తెరమీదికి వచ్చింది. జనసేన నుంచి సస్పెన్షన్ కు గురైన కోట వినుత భర్త చంద్రబాబు చేసిన సెల్పీ వీడియో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ హత్యతో తమకు సంబంధం లేదని చెబుతూనే.. మరోసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. చైన్నై పోలీసు కమిషనర్.. రాయుడి హత్యపై స్పందించక ముందే.. బొజ్జల స్పందించారన్నది ప్రధాని ఆరోపణ.
కాబట్టి.. ఈవిషయంలో బొజ్జల సుధీర్‌ను కేంద్రంగా చేసుకుని విచారణ జరిపించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇదిలావుంటే.. ఇరు పార్టీల్లోనూ.. ఈ వ్యవహారం తాజాగా చర్చకు దారితీసింది. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు చంద్రబాబు చేసిన సెల్ఫీ వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి దీనిలో నిజం ఏంటనేది .. ప్రభుత్వం తేల్చి ఉంటే .. ఇప్పుడు ఈ సమస్య మరోసారి వచ్చి ఉండేది కాదు. జనసేన నాయకురాలిని పార్టీ నుంచి బహిష్కరించలేదు కాబట్టి.. ఆమె పార్టీ కండువాతోనే తిరుగుతున్నారు.
మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చినా మౌనంగా ఉండడంతో ఆయన కూడా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఇలా.. రెండు వర్గాల మధ్య కూడా ఈ రాయుడు వ్యవహారం నలుగుతోంది. కానీ, స్థానికంగా మాత్రం ఇరు పార్టీల విషయంలో ప్రజలు దూరమయ్యే అవకావం ఉంది. నాయకుల కోసం.. పార్టీని ఫణంగా పెట్టడం సరికాదని ఇరు పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. ఏదో ఒక టి తేల్చాలని కోరుతున్నారు.
హత్య నిజమే అయితే.. దీనిపై విచారణ చేసి.. నిజానిజాలు తేల్చాలని టీడీపీ నేతలు కూడా కోరుతున్నారు. ఇక, జనసేన నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారు. ఇదిలావుంటే..తనకు సంబంధం లేదని గతంలోనే ఎమ్మెల్యే చెప్పారు. అయితే.. అసలు అంతా ఆయనే చేశారని కోట దంపతులు ఆరోపిస్తున్నారు. ఇలా.. ఇరు వర్గాల మధ్య నిప్పు రాజేస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకపో తే.. కీలక నియోజకవర్గంలో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
