Begin typing your search above and press return to search.

సిక్కోలు నుంచి ఎగరనున్న విమానం

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్నాణం అవుతోంది. వచ్చే ఏడాదిలోనే తొలి విమానం ఎగరనుంది.

By:  Satya P   |   16 Nov 2025 9:19 AM IST
సిక్కోలు నుంచి ఎగరనున్న విమానం
X

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్నాణం అవుతోంది. వచ్చే ఏడాదిలోనే తొలి విమానం ఎగరనుంది. అయితే ఇదే ఉత్తరాంధ్రాలో మరో ఎయిర్ పోర్టు రానుంది. దానికి సంబంధించి విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలకమైన అడుగు పడింది. శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన పెట్టుబడుల సదస్సులో భాగంగా మరో ఎయిర్ పోర్టుని నిర్మించేందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీంతో శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు అయింది., కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు.

మరింత కనెక్టివిటీ :

ఈ తాజా ఒప్పందంతో శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ పోర్ట్ వస్తోంది. దాంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే పర్యాటక రంగానికి ఈ పరిణామం మరింతగా దోహదపడుతుందని చెబుతున్నారు. ఇక ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్ధిక వృద్ధికి ఊతం లభిస్తుందని అంటున్నారు. ఇక ఒప్పందం కుదిరిపోయింది కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన కూడా చురుకుగా జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పూర్తి షాయిలో పనిచేయనున్నాయి.

వెనుకబడిన జిల్లా :

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అత్యంత వెనకబడిన జిల్లగా ఉంది. అయితే తాజాగా ఎయిర్ పోర్టు నిర్మాణంతో అక్కడ కూడా ప్రగతి గతి మారుతుందని అంటున్నారు ఎయిర్ పోర్టు వస్తే దాని అనుసంధానంగా ఉండేవి సైతం వస్తాయి. ప్రపంచంతో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. మరో వైపు చూస్తే తన సొంత జిల్లాకు ఎయిర్ పోర్టుని నిర్మించాలని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇపుడు ఆయన కోరిక సాకారం కాబోతోంది. ఆయన పేరు కూడా జిల్లా చరిత్రలో నిలవబోతోంది అని అంటున్నారు.

జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు :

ఇదిలా ఉంటే ఒక జిల్లా ఒక విమానాశ్రయం ఒక ఉత్పత్తి కాన్సెప్ట్ తరహాలోనే శ్రీకాకుళానికి ఎయిర్ పోర్టు వస్తోంది అని అంటున్నరు. అలాగే ప్రతి ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్న ప్రాంతంలో అత్యుత్తమమైన ఒక ఉత్పత్తిని గుర్తించి ఆ ఉత్పత్తికి అనుగుణంగా కార్గో ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. దేశంలో 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా ఈ రోజుకు వాటి సంఖ్య 164కు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. వృద్ధిని కొనసాగించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సేవలు, తయారీ వ్యవస్థ భవిష్యత్తు సాంకేతికతతో ఈ రంగాన్ని సంస్కరించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు.

మరిన్ని ఎయిర్ పోర్టులు :

మరో వైపు చూస్తే దేశంలో గత 10 ఏళ్లలో విమాన ప్రయాణాలు ప్రయాణీకుల సంఖ్య అంతర్జాతీయ విమానాల సంఖ్య, దేశీయ విమానాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యాయని ఆయన గణాంకాలను వెల్లడించారు. 2014లో 6.7 కోట్ల నుండి 2024లో 7.2 కోట్లకు పెరిగారని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులు 2.5 కోట్ల నుండి 7.2 కోట్లకు పెరిగారని గుర్తుచేశారు. దేశీయ విమానాలు చూస్తే కనుక 2014లో 6 లక్షల నుండి 2024లో 11 లక్షలకు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న 164 ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను మరింత పెంచడానికి వాటి నిర్వహణ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. దీంతో శ్రీకాకుళానికి ఒక ఎయిర్ పోర్టు రాబోతోంది. ఇది ఉత్తరాంధ్రకు శుభ పరిణామంగానే చూడాల్సి ఉంది.