Begin typing your search above and press return to search.

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్ జీవీఎంసీని కూటమి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. 120 వార్డులకు గాను 106 వార్డుల్లో కూటమి ఆధిక్యం సాధించింది. మేయర్ అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం, వార్డుల సమన్వయం వరకు విశాఖ ఎంపీ శ్రీభరత్ కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తూర్పు కాపు సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలచుకోవడం కూడా విజయానికి దోహదపడిందనే విశ్లేషణ వినిపిస్తోంది.

By:  Satya P   |   5 Nov 2026 1:36 PM IST
క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?
X

ఏపీలోనే అతి పెద్ద కార్పొరేషన్ కూటమి ఖాతాలో పడింది. అది కూడా దాదాపుగా రెండున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీతో. ఒకసారి మాత్రమే కార్పోరేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ఒక నాయకురాలిని తెచ్చి ఏకంగా జీవీఎంసీ పీఠం మీద కూర్చోబెట్టడం అంటే టీడీపీకే అది చెల్లింది. అయితే ఆమె అభ్యర్ధిత్వాన్ని గుర్తించి ఎంపిక చేయడం సామాజిక రాజకీయ సమీకరణలను అన్నీ వడపోసి గెలుపుని ముందే ఊహించి ఖరారు చేయడంతో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాత్ర కీలకంగా ఉంది అని అంటున్నారు. ఇక్కడే వైసీపీ ఎత్తుకు పై ఎత్తు ఎంపీ వేశారు అని అంటున్నారు.

ఆ సామాజిక వర్గం పైన :

విశాఖ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో అనేక మంది బిగ్ షాట్స్ వారసుల పేరులు వినిపించాయి. ఒక దశలో అయితే డజన్ కి పైగా పేర్లు విన వచ్చాయి. అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఎంతో మంది మేయర్ పీఠం కోసం కర్చీఫ్ వేసిన నేపథ్యం ఉంది. ఇక ఇదే సమయంలో కూటమికి దెబ్బ తీయాలని వైసీపీ ఒక ఎత్తు వేసింది. అదే బీసీ కార్డు. బీసీ మహిళకు టికెట్ ఇవ్వడం ద్వారా కూటమి ఓసీకి చాన్స్ ఇస్తే దాన్ని ఎండగడుతూ తమ రాజకీయాన్ని పండించుకోవాలని అనుకుంది. అక్కడే ఎంపీ శ్రీభరత్ పై ఎత్తు వేశారు అని అంటున్నారు. బీసీల పార్టీగా ముద్ర ఉన్న టీడీపీ ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటూనే బీసీలలో తూర్పు కాపులకు అవకాశం కల్పించడం ద్వారా వైసీపీ బీసీ అస్త్రాన్ని తిప్పి కొట్టగలిగారు అని అంటున్నారు. జీవీఎంసీ పరిధిలో తూర్పు కాపులు హెచ్చు సంఖ్యలో ఉన్నారు. దాంతో పాటు ఓసీ కాపులు కూడా ఆ వైపుగా టర్న్ అయ్యారు. ఇవన్నీ కలసి సామాజిక పరమైన సమీకరణలను కూటమికి పూర్తి స్థాయిలో అనుకూలంగా మార్చేశాయి అని అంటున్నారు.

వన్ మ్యాన్ షో గానే :

ఇక జీవీఎంసీ పరిధిలో ఎంతో మంది దిగ్గజ నేతలు ఉన్నా భరత్ అంతా తానై మేయర్ ఎన్నికల్లో ముఖ్య భూమిక పోషించారు అని అంటున్నారు. ఆయన అభ్యర్ధి ఎంపికలో కీలక పాత్ర నుంచి ప్రచారం నుంచి వార్డూల్లో అభ్యర్ధుల ఎంపిక కూటమితో కో ఆర్డినేషన్ ఇలా అన్నీ చూసుకోవడం ద్వారానే ఇంతటి విజయం దక్కించగలిగారు అంటున్నారు. ఈ రోజున జీవీఎంసీలో 120 వార్డులు ఉంటే 14 వార్డులు తప్పించి 106 వార్డులలో కూటమి కనిపిస్తుంది. అంతలా కూటమికి ఘన విజయం దక్కడం వెనక యువ ఎంపీ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆయనకు ఈ ఎన్నికలలో విజయం తరువాత అధినాయకత్వం వద్ద మరింతగా పేరు వచ్చిందని చెబుతున్నారు. గతంలో శ్రీ భరత్ తాత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కూడా విశాఖ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. ఇపుడు అదే ఒరవడిని శ్రీ భరత్ కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. గడచిన రెండున్నరేళ్ళుగా విశాఖ జిల్లాకు మంత్రి లేకపోయినా ఎంపీ తనదైన శైలిలో స్థానికంగా పట్టు సాధించారని గుర్తు చేస్తున్నారు. ఇదే తీరున ఆయన ముందుకు సాగితే సుదీర్ఘ కాలం పాటు తన పలుకుబడిని కొనసాగిన్స్తారని అంటున్నారు. ఇక ఈ విజయంతో 2029 లో విశాఖ జిల్లా పూర్తి బాధ్యతలు భరత్ మీదనే పెడతారు అని కూడా వినిపిస్తున్న మాట.