Begin typing your search above and press return to search.

సర్ కి సలాం కొట్టలేం !

ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు.

By:  Satya P   |   28 Oct 2025 11:00 PM IST
సర్ కి సలాం కొట్టలేం !
X

సర్ అంటే దేశంలోని విపక్షానికి చిర్రెత్తుకుని వస్తోంది. సర్ అన్నది షార్ట్ కట్ పదం. ఇది మర్యాదపూర్వకంగా ఇంగ్లీష్ లో అనిపించినా సర్ కి అసలైన అర్ధం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ . కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ని అమలు చేయడానికి రెడీ అయిపోతోంది. ఆ వివరాలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా ముందు వెల్లడించారు. ఇక ఈసీ రెండవ విడతలో భాగంగా సర్ ని అమలు చేయబోయే రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది. అదే విధంగా కేరళకు కూడా 2027లో ఎన్నికలు ఉన్నాయి దాంతో ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి సర్ మీద కారాలూ మిరియాలూ నూరుతోంది.

ప్రజాస్వామ్యానికే పెను ముప్పు :

దేశంలో రెండో విడతగా అమలు చేయబోతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ అన్నది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాలలో దీనిని చేపడతామని ఈసీ ప్రకటించిన కొద్ది గంటలలోనే ఆయన నుంచి పూర్తి వ్యతిరేకతతో ప్రకటన విడుదల అయింది. ఈ విధంగా ఈసీ కనుక వ్యవహరించ దలచుకుంటే అది ఈసీ ఉనికి మీదనే సరికొత్త సందేహాలకు కారణం అవుతుందని కూడా ఆయన అంటున్నారు. అదే విధంగా దేశంలో ఎన్నికల వ్యవస్థ మీదన కూడా జనాలలో ఎన్నో అనుమానాలకు పూర్తి స్థాయిలో తావిస్తుందని కూడా పినరయి విజయన్ అంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని దీబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన ఘాటుగానే హెచ్చరించారు.

నిబంధనలకు పాతర :

ఈసీ చెబుతున్న దానిని బట్టి చూస్తే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం అలాగే 1960 నాటి ఓటర్ల జాబితా సవరణలకు వాటి నిబంధనలకు పూర్తి స్థాయిలో ఉల్లగించడమే అని కూడా విజయన్ అన్నారు. సర్ పేరుతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాకు బదులుగా 2002 నుంచి 2004 వరకూ ఉన్న ఓటర్ల జబితాల ఆధారంగా సవరణ చేయడానికి ఈసీ సన్నాహాలు చేస్తోంది అని కేరళ ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. దీనిని ఎవరూ అంగీకరించే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

అదే కరెక్ట్ విధానం :

ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు. ఆ విధంగానే ఈసీ వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక చూస్తే కేరళలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఆ సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ని అమలు చేయడం అన్నది అసాధ్యమని విజయన్ అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పటికే ఈసీకి తెలియచేశారని అయినా కూడా ఈసీ సర్ ని అమలు చేస్తామని చెప్పడం మీద ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏకంగా ఈసీ వ్యవహరిస్తున్న తీరు మీదనే పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విజయన్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసీ దేశంలో రెండో విడతగా అమలు చేయాలనుకుంటున్న సర్ అంత సులువుగా కనిపించడం లేదు అని అంటున్నారు. మరి ఏ విధంగా ఈసీ అమలు చేస్తుందో చూడాలి ఉంది.