Begin typing your search above and press return to search.

ఫజిల్: పట్టాలు దెబ్బ తినకుండా.. స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక.. సమర్థవంతమైన రైలు రవాణా వ్యవస్థకు కేరాఫ్ అడ్రస్ గా స్పెయిన్ ను చెబుతారు.

By:  Garuda Media   |   19 Jan 2026 11:51 AM IST
ఫజిల్:  పట్టాలు దెబ్బ తినకుండా.. స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం
X

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక.. సమర్థవంతమైన రైలు రవాణా వ్యవస్థకు కేరాఫ్ అడ్రస్ గా స్పెయిన్ ను చెబుతారు. ఈ దేశంలో సుమారు 4వేల కి.మీ. నిడివితో యూరోప్ లోనే అతి పెద్ద హైస్పీడ్ రైల్వే నెట్ వర్కును కలిగి ఉంది. చైనా తర్వాత ఈ స్థాయిలో ఉన్న దేశం స్పెయిన్ మాత్రమే. అలాంటి దేశంలో తాజాగా చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

రైలు ప్రమాదం ఒక ఎత్తు అయితే.. యాక్సిడెంట్ జరిగిన తీరు.. దాని తీవ్రతను చూసినప్పుడు అర్థం కాని అంశాలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. సౌత్ స్పెయిన్ లోని అడముజ్ సమీపంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఒక ప్రైవేటు హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి.. పక్కనే ఉన్న పట్టాలపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న రైలును బలంగా ఢీ కొనటంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

ఆదివారం రాత్రి జరిగిన ఈ రైలు ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా.. వందకు పైగా ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న నాలుగు మీటర్ల లోతులో ఉన్న గొయ్యిలో పడటంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడీ రైలు ప్రమాదం షాకింగ్ గా మారింది.

ఎందుకంటే.. ఈ రైలు ట్రాక్ ను 2025 మేలోనే ఆధునీకరించటం.. ప్రమాదానికి గురైన రైలు కొత్తది కావటం.. ప్రమాదం జరిగిన ప్లేస్ ను చూస్తే.. వంపులు లేకుండా నేరుగా ఉన్న దానిపై చోటు చేసుకోవటం.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా పట్టాలు డ్యామేజ్ కాకపోవటంతో ఈ ప్రమాదం పెద్ద ఫజిల్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పెయిన ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్.. స్పానిష్ రాజు.. రాణి ఇరువురు తమ దిగ్ర్బాంత్రిని.. సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదం మిస్టరీని తలపిస్తున్న పరిస్థితి.

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైల్వే నెట్ వర్కుగా స్పెయిన్ కు పేరుంది. అలాంటి దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవటం.. విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు మిస్టరీగా మారాయి. నిర్దేశిత వేగం కంటే ఎక్కువగా వెళుతున్నప్పుడు కానీ.. పట్టాల మీద ఏమైనా అడ్డకుంలు ఉన్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా బ్రేకులు వేసే అధునాతన వ్యవస్థ స్పెయిన్ రైల్వే నెట్ వర్కులో ఉంది. అయినప్పటికీ.. ప్రమాద సమయంలో అవమీ ఎందుకు పని చేయలేదు? అన్నది పెద్ద ప్రశ్న.

స్పెయిన్ అధికారుల బుర్ర బద్ధలు కొట్టుకునేలా చేస్తున్న మరో షాకింగ్ అంశం ఏమంటే.. రైలు పట్టాలు తప్పటమే అరుదు అనుకుంటే.. అదే సమయంలో ఎదురుగా మరో రైలు రావటం. ఇది చాలా అరుదైన యాదృచ్ఛికంగా చెబుతున్నారు. సాధారణంగా ఒక రైలు పట్టాలు తప్పినంతనే సెన్సార్ల ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇతర రైళ్లు ఆగిపోవాలి. కానీ.. ఇదెందుకు జరగలేదు? అన్నది మరో ప్రశ్న. రైలు వేగం.. డ్రైవర్స్ తీసుకున్న చర్యలకు సంబంధించి బ్లాక్ బాక్స్ డేటాకు సంబంధించి అనాలసిస్ ఇంకా సాగుతోంది. డేటాలో కొంత భాగం దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. అసలేం జరిగిందో తేల్చేందుకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు.