రాజీవ్ ప్రధాని కాకుండా అడ్డుకున్న సోనియా !
అదే మిటి ఆమె ఆయన సతీమణి కదా. భర్తను ప్రోత్సహిస్తుంది కదా అని అంతా అనుకుంటారు.
By: Satya P | 28 Oct 2026 8:00 AM ISTఅదేమిటి ఆమె ఆయన సతీమణి కదా. భర్తను ప్రోత్సహిస్తుంది కదా అని అంతా అనుకుంటారు. కానీ రాజీవ్ గాంధీని ప్రధాని కాకుండా తాను అడ్డుకున్నాను అని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ తానే స్వయంగా ఈ విషయం చెప్పాక అందరికీ ఆశ్చర్యం తో పాటు సరిగ్గా 42 ఏళ్ళ క్రితం 1984 అక్టోబర్ 31 న ఏమి జరిగింది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ భారత దేశంలో ఆనాటి ఉక్కు మహిళ అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దారుణ హత్య మాత్రం దిగ్భ్రాంతిని కలిగించింది. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య తర్వాత సరిగ్గా 36 ఏళ్ళకు జరిగిన మరో దారుణంగా దీనిని నాటి దేశ ప్రజలు అంతా భావించారు.
రాజీవ్ పేరునే అంతా :
ఆ సమయంలో కాంగ్రెస్ అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ మాత్రమే. పార్టీలో ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా మంత్రి పదవి కూడా రాజీవ్ ఆశించలేదు దానికి కారణం సోనియా గాంధీ అని అంటారు. అసలు తన భర్త రాజకీయాల్లోకి రావడమే సోనియాగాంధీకి ఇష్టం లేదని అంటారు. అయితే 1980 జూన్ లో సంజయ్ గాంధీ మరణం తర్వాత బలవంతంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు ఇందిర మరణంతో రాజీవ్ కి ఏకంగా ప్రధాని పీఠమే అంది వచ్చింది.
సోనియా చెప్పిన ఫ్లాష్ బ్యాక్ :
ఇదిలా ఉంటే తన మొత్తం జీవితం గురించి ఆమె రాసిన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా సోనియా గా గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె రాజీవ్ గాంధీని ప్రధాని కాకుండా తాను వ్యతిరేకించాను అని చెప్పారు. రాజీవ్ ప్రధాని కావడం తనకు ఇష్టం లేదని అందుకే ఆ పెద్ద పదవికి దూరంగా ఉండమని చెప్పాను అని సోనియా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏమి జరిగిందో తాను రాసిన పుస్తకంలో స్పష్టంగా వివరంగా ఉంటుందని హింట్ ఇచ్చారు అయితే. తన గురించి ఎన్నో విషయాలు వ్యాప్తి చేశారని అవన్నీ నిజాలు కావని ఆమె అన్నారు. అనేకమైనవి కల్పితాలు అని అలాగే కల్పించి రాసినవి అని సోనియా గాంధీ చెప్పారు అందుకే తన జీవితంలో అతి ముఖ్య ఘట్టాలు జరిగినపుడు అసలు నిజాల్ని అలాగే తన జీవిత కథను ఉన్నది ఉన్నట్లుగా రాసేందుకే ఈ ప్రయత్నం చేశాను అని తన పుస్తకం గురించి సోషల్ మీడియాలో వివరించారు.
ఎన్నో కీలక విషయాలు :
ఈ పుస్తకం తరువాత తాను ఏమిటి అన్నది భారత దేశ ప్రజలకు పూర్తిగా అర్ధం అవుతుందని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తన గురించి బయట ప్రచారంలో ఉన్నవి తప్పు అని ఈ పుస్తకం మార్కెట్ లో రిలీజ్ అయిన తరువాత జనాలు తెలుసుకుంటారు అని సోనియా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తన పుస్తకం ఒక పెద్ద చర్చకు కూడా అస్కారం కల్పించనున్నట్లుగా ఆమె భావిస్తున్నారు. మరి ఇంతకీ సోనియా గాంధీ రాసిన ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలంటే నవంబర్ 10 వరకూ ఆగాల్సిందే.
